ETV Bharat / business

'ఆన్​లైన్​ యాడ్స్​ కోసం కుమ్మక్కైన సుందర్​, మార్క్​​!'

author img

By

Published : Jan 15, 2022, 10:04 AM IST

Google FB Secret Deal: ఆన్​లైన్ యాడ్ సేల్స్​ కోసం దిగ్గజ టెక్ సంస్థలైన గూగుల్, ఫేస్​బుక్​ కుమ్మక్కయ్యాయంటూ అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రెండు సంస్థల సీఈఓలకు ఈ రహస్య ఒప్పందం గురించి పూర్తిగా తెలుసని అనేక రాష్ట్రాల అటార్నీ జనరళ్లు ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

Google FB Secret Deal
'ఆన్​లైన్​ యాడ్స్​ కోసం కుమ్మక్కైన సుందర్​, మార్క్​​!'

Google FB Secret Deal: గూగుల్​, ఫేస్​బుక్​కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆన్​లైన్​ యాడ్ సేల్స్ విషయంలో ఆ రెండు సంస్థలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. గూగుల్​ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్​బుక్​ అధినేత మార్క్ జుకర్​బర్గ్​కు ఈ రహస్య ఒప్పందం గురించి తెలుసని, వారి ఆమోదంతోనే ఇదంతా జరిగిందన్నది అందులోని ప్రధాన ఆరోపణ.

టెక్సాస్​ అటార్నీ జనరల్​ కెన్​ పాక్స్​టన్​ నేతృత్వంలో అనేక రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కలిసి 2021 డిసెంబర్​లో ఈ లా సూట్​ దాఖలు చేశారు. రెండు దిగ్గజ సంస్థలు ఇలా ఒప్పందం చేసుకోవడం పోటీతత్వ స్ఫూర్తికి విరుద్ధమని అందులో పేర్కొన్నారు. 2018 సెప్టెంబర్​లో గూగుల్​-ఫేస్​బుక్​ మధ్య ఈ ఒప్పందం జరిగిందంటూ.. అందుకు సంబంధించిన అనేక వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా.. ఫేస్​బుక్​ చీఫ్​ ఆపరేటింగ్ ఆఫీస్​ షెరిల్ సాండ్​బర్గ్​కు, ఆమె సంస్థలోని కీలక వ్యక్తులకు మధ్య జరిగిన ఈమెయిల్​ సంభాషణలోని కీలకాంశాలను ప్రస్తావించారు. ఒప్పందం ఖరారు అయ్యాక.. తుది ఆమోదం కోసం జుకర్​బర్గ్​​కు కూడా మెయిల్ పంపినట్లు వివరించారు.

తోసిపుచ్చిన గూగుల్​, ఫేస్​బుక్​

ఈ ఆరోపణలపై గూగుల్​ స్పందించింది. వ్యాజ్యంలో ఉన్న అంశాలన్నీ అసత్యాలని, న్యాయపరంగా విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ డీల్​కు సుందర్​ ఆమోదం ఉందన్న వాదనల్ని గూగుల్ అధికార ప్రతినిధి పీటర్ షోటెన్​ఫెల్స్​ తోసిపుచ్చారు. ఏటా వందలాది ఒప్పందాలు చేసుకుంటామని, ప్రతిదానికీ సీఈఓ ఆమోదం అవసరం ఉండదని చెప్పారు.

గూగుల్​తో ఒప్పందంలో కొత్తదనం ఏమీ లేదని మెటా(ఒకప్పటి ఫేస్​బుక్​) సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. యాడ్​ ప్లేస్​మెంట్స్​ కోసం ఇతర సంస్థలతో చేసుకునే ఒప్పందాల లాంటిదేనని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.