దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పుత్తడి ధర రూ.187 క్షీణించింది. వెండి ధర రికార్డు స్థాయి నుంచి కాస్త వెనక్కి తగ్గింది.
దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,846 వద్దకు చేరింది. కిలో వెండి ధర కూడా మంగళవారం రూ. 1,933 (దిల్లీలో) తగ్గింది. ప్రస్తుతం రూ. 64,297 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గుతుండటం దేశీయంగా ధరల క్షీణతకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సుకు 23.60 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది.
ఇదీ చదవండి: 9.5 బిలియన్ డాలర్లు చెల్లించిన ఫోక్స్‌వేగన్