ETV Bharat / business

సాంకేతిక సమస్యతో జీమెయిల్ లాక్​'డౌన్​'! - glitches in gmail

భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జీమెయిల్ సేవలకు నేడు అంతరాయం ఏర్పడింది. చాలా మంది యూజర్లు జీమెయిల్​లోకి లాగిన్​ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు 90 నిమిషాలకుపైగా సమస్య ఎదురైనట్లు యూజర్లు తెలిపారు.

glitches in gmail
జీ మెయిల్​లో సాంకేతిక సమస్య
author img

By

Published : May 5, 2020, 1:16 PM IST

Updated : May 5, 2020, 2:27 PM IST

గూగుల్​కు చెందిన ప్రముఖ ఈమెయిల్ సేవల వ్యవస్థ జీమెయిల్​లో నేడు చాలా సేపు సమస్యలు తలెత్తాయి. వేల సంఖ్యలో యూజర్లు జీమెయిల్​లోకి లాగిన్​ అవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చాలా మంది యూజర్లు జీమెయిల్ పీఓపీ సర్వీసుల్లోకి లాగిన్​ అవ్వడంలో సమస్య ఎదుర్కొన్నట్లు తెలిపారు.

టెక్​ సేవల్లో తలెత్తే సమస్యలపై సమాచారమందించే.. 'డౌన్​డిటెక్టర్'​ జీమెయిల్​ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది. ఆసియా, అమెరికా, ఐరోపాల్లోని కొన్ని ప్రాంతాల్లో సమస్యలు తలెత్తినట్లు తెలిపింది.

భారీ సంఖ్యలో యూజర్లకు ఇదే సమస్య ఎదుర్కొనగా.. కొంత మంది దీనిపై ట్విట్టర్​లో చర్చించారు.

'పీఓపీ3.. గత 90 నిమిషాలుగా నుంచి పని చేయడం లేదు. పెద్ద ఎత్తున యూజర్లకు ఈ సమస్య వచ్చింది. చాలా మంది ఏఎంఏపీ కూడా పని చేయడం లేదని చెబుతున్నారు.' అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

'జీ మెయిల్ పాప్​ అప్ యూజర్లు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీ మెయిల్ పాప్​అప్​ సర్వీసుల్లోకి లాగిన్​ అవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతోంది మాకు చెప్పండి.' అని మరో యూజర్ ట్వీట్ చేశాడు.

ఇదీ చూడండి:వాహనదారులకు షాక్- భారీగా పెరిగిన పెట్రో ధరలు

Last Updated : May 5, 2020, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.