దేశవ్యాప్తంగా 5,600 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయని ప్రభుత్వ రంగ సంస్థ రైల్టెల్ తెలిపింది. 'స్టేషన్' పేరిట నిర్వహిస్తున్న ఉచిత వైఫై కార్యక్రమానికి త్వరలో ముగింపు పలకనున్నట్లు గూగుల్ వెల్లడించిన నేపథ్యంలో 'రైల్టెల్' తాజా ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి గూగుల్ తప్పుకున్నప్పటికీ.. వైఫై స్పీడులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
- — RailTel (@RailTel) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— RailTel (@RailTel) February 17, 2020
">— RailTel (@RailTel) February 17, 2020
దేశవ్యాప్తంగా 400కు పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ఇచ్చే ఉద్దేశంతో భారత రైల్వే సహా రైల్టెల్ భాగస్వామ్యంతో 'స్టేషన్' పేరిట 2015లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది గూగుల్. వీటి మధ్య ఒప్పందం ఈ ఏడాది మధ్యలో ముగియనుంది.
ఒప్పందం అమలు ఇలా..
ఒప్పందం కుదిరినప్పటి నుంచి పలు రైల్వే స్టేషన్లలో రైల్టెల్ ఉచితి వైఫైను అందిస్తుండగా.. గూగుల్ సాంకేతిక భాగస్వామిగా వ్యహరిస్తోంది. ఏ, సీ కేటగిరీల్లో 415 స్టేషన్లకు అందించే ఉచిత వైఫై ప్రోగ్రాంలో గూగుల్ కృత్రిమ మేధ సాంకేతికత భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా బీ, సీ, డీ కేటగిరీల్లో ఉన్న మరో 5190కు పైగా స్టేషన్లలోనూ ఉచిత వైఫై సేవలు అందిస్తున్న విషయాన్ని రైల్టెల్ గుర్తు చేసింది.