ETV Bharat / business

ఎస్​ బ్యాంక్ సంక్షోభంపై ఎవరెవరు ఏమన్నారంటే..

ఎస్​ బ్యాంక్​పై ఆర్బీఐ మారటోరియం విధించిన నేపథ్యంలో ఇటు ఖాతాదారుల్లో అటు పెట్టుబడులు పెట్టిన వారిలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ఎస్​బీఐ ఛైర్మన్​లు కీలక ప్రకటనలు చేశారు.

yes bank crisis
ఎస్​ బ్యాంక్ సంక్షోభం
author img

By

Published : Mar 6, 2020, 10:12 PM IST

భారీ రుణ భారం, పాలనా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఎస్​ బ్యాంక్​పై గురువారం మారటోరియం విధించింది ఆర్బీఐ. నగదు ఉపసంహరణకు నెలకు రూ.50,000 పరిమితి విధించింది. ఈ కారణంగా ఎస్​ బ్యాంక్​ ఖాతాదారులు పెద్ద ఎత్తున ఏటీఎంలు, బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల్లో భయాలు నెలకొన్నందున వారి ఆందోళనలు తగ్గించేందుకు ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్​, ఎస్​బీఐ ఛైర్మన్​లు స్పందించారు.

ఖాతాదారులకు, ఉద్యోగులకు భరోసా..

ఎస్‌ బ్యాంకులో సంక్షోభం ఉన్నా ఏ ఖాతాదారుడి డబ్బుకు కూడా ప్రమాదం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎస్‌ బ్యాంకు సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు త్వరలోనే ఆర్బీఐ ఓ ప్రణాళికను రూపొందిస్తుందని వెల్లడించారు. ఈ సమస్యపై తాను ఆర్బీఐతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. ఏ నిర్ణయం అయినా డిపాజిటర్లు, బ్యాంకులు, ఆర్థిక వ్యవస్ధ ప్రయోజనాల రీత్యానే ఉంటుందని భరోసా ఇచ్చారు.ఎస్‌ బ్యాంకులో డబ్బుపై ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆమె హామీ ఇచ్చారు. ఎస్‌ బ్యాంకు ఖాతాదారులు నెలకు రూ.50,000 వరకు మాత్రమే నగదు ఉపసంహరించుకునే నిబంధనపై స్పందించిన ఆర్థిక మంత్రి.. అత్యవసర ఖర్చుల కోసం అంతకు మించి డబ్బు అవసరమైతే అందుకోసమూ తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరో వైపు ఎస్​ బ్యాంక్ ఉద్యోగులకు ఏడాది పాటు వేతనాలు అందుతాయని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.

మారటోరియం సరైనదే.. ​

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్‌ బ్యాంకుపై మారటోరియం విధించిన సమయం సరైనదే అని భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

ఎస్‌ బ్యాంకును చక్కదిద్దేందుకు చాలా గొప్ప పథకాన్ని తీసుకురానున్నట్లు దాస్​ వెల్లడించారు. ఎస్‌ బ్యాంకు విషయంలో చాలా విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం ఆ బ్యాంకు సంక్షేమం మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ సుస్ధిరతను దృష్టిలో ఉంచుకుని అడుగువేసినట్లు వెల్లడించారు. దేశ బ్యాంకింగ్‌ రంగంలో దృఢత్వం, భద్రత కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. ఎస్‌ బ్యాంకును గాడిలో పెట్టేందుకు బ్యాంకులు, మార్కెట్‌లు ముందుండి నడిపించే పథకాన్ని అమలు చేయనున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు.

ఆందోళన అవసరంలేదు..

ఎస్‌ బ్యాంకులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎస్​ బ్యాంక్ సంక్షోభం గురించి స్పందించారు.

"ఎస్‌బ్యాంకుతో ఆందోళన ఏముంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మదుపర్ల డబ్బులన్నీ సురక్షితంగా ఉన్నాయి. రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా అదే చెప్పారు. కాస్త ఓపికతో వ్యవహరించండి. అంతా మంచే జరుగుతుంది"-రజనీశ్ కుమార్​, ఎస్​బీఐ ఛైర్మన్​

సంక్షోభం.. సమస్యలు..

ఎస్ బ్యాంక్​పై మారటోరియం విధించిన నేపథ్యంలో పలు ఇతర సమస్యలు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా ఎస్​ బ్యాంక్ సేవలతో పనిచేసే ఫోన్​పే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆర్బీఐ మారటోరియం విధించిన నేపథ్యంలో ఎస్​ బ్యాంక్ షేర్లు నేడు భారీగా నష్టపోయాయి. ఒకానొక దశలో 80 శాతానికి పైగా కుప్పకూలాయి. చివరకు 56 శాతానికిపైగా నష్టంతో ముగిసింది.

ఇదీ చూడండి:పేటీఎం, ఫోన్​పే మధ్య ట్విట్టర్​ వార్​- కారణం అదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.