ETV Bharat / business

Flipkart: 2.8 లక్షల కోట్లకు ఫ్లిప్​కార్ట్ విలువ! - ఫ్లిప్​కార్ట్ పెట్టుబడి ప్రణాళిక

వాల్​మార్ట్​, సాఫ్ట్ ​బ్యాంక్, జీఐసీ సహా పలు ఇతర సంస్థల నుంచి దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్ భారీగా నిధులు సమీకరించింది. ఆయా సంస్థల నుంచి సమీకరించిన నిధులతో కంపెనీ విలువ దాదాపు రూ.2.8 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది.

Flipkart rise huge funds
ఫ్లిప్​కార్ట్ భారీగా నిధుల సేకరణ
author img

By

Published : Jul 12, 2021, 1:35 PM IST

Updated : Jul 12, 2021, 2:56 PM IST

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ భారీగా నిధులు సమీకరించింది. జీఐసీ, కెనడా పెన్షన్​ ప్లాన్​ ఇన్వెస్ట్​మెంట్ బోర్డ్​ (సీపీపీ ఇన్వెస్ట్​మెంట్​), సాఫ్ట్​​ బ్యాంక్ విజన్​ ఫండ్​2, వాల్​మార్ట్​ల ద్వారా 3.6 బిలియన్ డాలర్లు (రూ.26,805.6 కోట్లు) సమీకరించినట్లు తెలిపింది. ఈ నిధుల సమీకరణతో కంపెనీ విలువ 37.6 బిలియన్​ డాలర్ల (రూ.28,00,35,40,00,000) మార్క్ దాటినట్లు తెలిపింది ఫ్లిప్​కార్ట్.

ఫ్లిప్​కార్ట్​కు నిధులు సమకూర్చిన సంస్థల్లో.. ఖతర్​ ఇన్వెస్ట్​మెంట్ అథారిటీ, సావరిన్ ఫండ్స్ డిస్రప్ట్ ఏడీ, ఫ్రాంక్లిన్ టెపుల్​టన్​, టైగర్​ గ్లోబల్​ వంటి సంస్థలు ఉన్నట్లు పేర్కొంది.

ఫ్లిప్​కార్ట్.. భారత్​లో అమెజాన్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​కు చెందిన జియో మార్ట్ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. తాజాగా సమీకరించిన నిధులను.. సాంకేతిక అభివృద్ధికి, సప్లయి చైన్​ను మరింత బలోపేతం చేసుకునేందుకు, వేగంగా వృద్ధి చెందుతున్న వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్​కు తగ్గట్లు మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది ఫ్లిప్​కార్ట్.

ఇదీ చదవండి:Amazon outage: అమెజాన్​ సేవలకు అంతరాయం

Last Updated : Jul 12, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.