ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్ చేతికి అగ్‌మెంటెడ్‌ రియాల్టీ సంస్థ 'స్కాపిక్​' - స్కాపిక్ కంపెనీ వివరాలు

కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్.. క్లౌడ్ సేవల సంస్థ స్కాపిక్​ను కొనుగోలు చేసింది. స్కాపిక్​లో 100 శాతం వాటాను దక్కించుకున్నట్లు ప్రకటించింది ఫ్లిప్​కార్ట్. అయితే ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందనే విషయం మాత్రం వెల్లడించలేదు.

What is Scapic Company
ఫ్లిప్​కార్ట్ స్కాపిక్ డీల్ విలువ
author img

By

Published : Nov 17, 2020, 1:10 PM IST

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సంస్థను కొనుగోలు చేసింది. అగ్‌మెంటెడ్‌ రియాల్టీ సేవలు అందించే స్కాపిక్‌ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. డీల్‌ విలువను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

స్కాపిక్‌ క్లౌడ్‌ ఆధారిత సేవలను అందిస్తుంది. ఏఆర్‌, 3డీ కంటెంట్‌ను పబ్లిష్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ కామర్స్‌, మార్కెటింగ్‌ సంస్థలకు సేవలను అందిస్తోంది. 'మేము రిటైల్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసే అంశాలపై పెట్టుబడి పెట్టాము. మా వినియోగదారులు సులభంగా అవసరమైనవి పొందేలా కంటెంట్‌, ఎక్స్‌పీరియన్స్ ద్వారా ప్రయత్నిస్తున్నాం’' అని కంపెనీ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఈ డీల్‌ ద్వారా ఫ్లిప్‌కార్ట్ 100శాతం వాటాలను పొందనుంది. ఆ తర్వాత బోర్డులోకి ప్రతిభావంతులైన డిజైనర్లు, డెవలపర్లకు అవకాశం ఇస్తామని పేర్కొంది. వర్చువల్‌ స్టోర్లు, బ్రాండ్‌ అడ్వర్టైజింగ్‌, కెమెరా ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామని సంస్థ పేర్కొంది.

స్కాపిక్‌ను 2017లో ప్రారంభించారు. ఇదే ఏడాది ఫ్లిప్‌కార్ట్‌ గేమింగ్‌ స్టార్టప్‌ మెచ్‌ మోచా నుంచి హలో ప్లేకు సంబంధించి మేధో హక్కులను కూడా కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా ఆ కంపెనీ గేమింగ్‌ బృందం ఫ్లిప్‌కార్ట్​లో చేరనుంది.

ఇదీ చూడండి:'బీమా కావాలనే అవగాహన ప్రజల్లో పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.