రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో మరో సారి 'బిగ్ బిలియన్ డేస్' ఆఫర్‌ను తీసుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ చందాదారులకు ఈ ఆఫర్ నాలుగు గంటల ముందే వినియోగించుకునేందుకు వీలు కలిపిస్తున్నట్లు తెలిపింది.
బిగ్‌బిలియన్ డేస్ ఆఫర్ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులతో కలిసి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
ముఖ్యంగా ఫోన్లు, గాడ్జెట్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నీచర్ వంటివి ప్రత్యేక తగ్గింపుతో విక్రయించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సారి గృహోపకరణాలపై బీమా అందిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: భారీగా తగ్గిన యాపిల్ ఐ ఫోన్ల ధరలు.. కారణమిదే!