ETV Bharat / business

2019-20లో భారత వృద్ధి 5.5 శాతమే! - ఆందోళన కరంగా భారత వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ అంచనాలను 5.5 శాతానికి తగ్గించింది ప్రముఖ రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్​. ప్రస్తుతం వృద్ధి కాస్త మందగించినా.. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ ఆశాజనకంగా ఉండనున్నట్లు ఫిచ్​ అభిప్రాయపడింది.

భారత జీడీపీ ఇంచనాను తగ్గించిన ఫిచ్​
author img

By

Published : Oct 24, 2019, 6:41 PM IST

భారత వృద్ధిపై మరింత ఆందోళనలు పెంచుతూ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాను 5.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. రుణభారంతో ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక రంగాలు వృద్ధి క్షీణతకు కారణమవుతున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది జూన్​లో విడుదల చేసిన అంచనాల్లో.. దేశ జీడీపీ 6.6 శాతంగా నమోదవుతుందని ఫిచ్ పేర్కొంది.

భారతీయ రిజర్వు బ్యాంకూ ఇటీవలే దేశ జీడీపీ అంచనాను 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం.

ప్రస్తుతం ఆర్థిక వృద్ధి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ.. 2020-21లో 6.2 శాతానికి.. ఆ తర్వాతి ఆర్థిక సంవంత్సరంలో 6.7 శాతానికి జీడీపీ వృద్ధి మెరుగుపడుతుందని ఫిచ్ అంచనాల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కార్పొరేట్ సుంకాల కోత వంటి ఉద్దీపనలు.. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే అవకాశముందని ఫిచ్ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: 'ఈజీ' కోసం జీఎస్టీ మరింత సరళీకృతం: నిర్మలా

Ahmedabad (Gujarat), Oct 24 (ANI): In the latest development in Kamlesh Tiwari murder case, two accused in Kamlesh Tiwari murder case are being taken to Lucknow from Ahmedabad airport after a local court granted 72 hours transit remand. The accused, Ashfaq Hussain Jakir Hussain Shaikh and Moinuddin Khurshid Pathan were arrested by Gujarat's Anti-Terrorism Squad (ATS) from the Gujarat-Rajasthan border on Tuesday. A total of five persons have been arrested so far. Recently, other accused were sent to police custody for four days in connection with the case. On October 18, Tiwari was murdered in Naka area of Lucknow.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.