భారత్‌లో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారంటూ.. రిజైన్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్(#ResignModi)తో పెట్టిన కొన్ని పోస్టులను ఫేస్బుక్ బ్లాక్ చేసింది. బుధవారం జరిగిన ఈ పరిణామాన్ని పలు నివేదికలు నిర్ధరించాయి.
అయితే కొన్ని గంటల్లోనే వాటిని రీస్టోర్ చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది. పొరపాటున ఆ పోస్ట్‌లను బ్లాక్ చేసినట్లు వివరణ కూడా ఇచ్చింది. అలాంటి పోస్ట్‌లు బ్లాక్ చేయమని ప్రభుత్వం తమను ఆదేశించలేదని స్పష్టతనిచ్చింది.
ఇలాంటి చర్యలకు పూనుకున్న సామాజిక మాధ్యమ సంస్థల్లో ఫేస్బుక్ మొదటిదేం కాదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులను తొలగించడం లేదా.. వాటని కట్టడి చేయడం వంటి చర్యలకు దిగుతోంది ట్విట్టర్.
ఇవీ చదవండి: