ETV Bharat / business

మీ 'బాస్'​కన్నా మీరే సమర్థంగా పని చేయగలరా...?

భారత్​లో 95 శాతం మంది ఉద్యోగులు.. పై అధికారుల విధులను తాము అంతకన్నా సమర్థంగా నిర్వహిస్తామని భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉద్యోగులు ఇదే ధోరణితో ఉన్నట్లు వెల్లడైంది.

అధికారులపై అసంతృప్తి
author img

By

Published : Sep 11, 2019, 1:36 PM IST

Updated : Sep 30, 2019, 5:31 AM IST

భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటిలో చాలా మంది ఉద్యోగులు తమ పైఅధికారికన్నా ఆ బాధ్యతలను.. తామే సమర్థంగా నిర్వహిస్తామని భావిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. వర్క్​ఫోర్స్ ఇన్​స్టిట్యూట్​ ఎట్​ క్రోనోస్​, ఫ్యూచర్​ వర్క్​ఫోర్స్ సంస్థలు నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

90వ దశకంలోని ఉద్యోగుల్లో 73 శాతం మంది, 2000 సంవత్సర తొలినాళ్లలోని ఉద్యోగుల్లో 70 శాతం మంది తమ పైఅధికారి బాధ్యతలను తాము ఇంకా సమర్థంగా నిర్వహిస్తామని బలంగా విశ్వసిస్తున్నారని సర్వే తెలిపింది.

గత ఏడాది జులై 31 నుంచి ఆగస్టు 9 మధ్య.. భారత్​, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, మెక్సికో, యూకే, యూఎస్​ల్లో 3,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది.
గ్రేడ్​ సీ, డీగా విభజించి.. కేటగిరీల ఆధారంగా వారిపై చేసిన ఈ సర్వేలో తమ పైఅధికారులు.. ఉద్యోగం-వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యమివ్వడంలో మెరుగుపడాల్సిన అవసరముందని 37 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగ నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరముందని 37 శాతం మంది తెలిపారు. పని సంబంధ వ్యవహారాల్లో మెళకువలు అవసరమని 33 శాతం మంది.. సంప్రదింపుల విషయంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరముందని 33 శాతం మంది తమ అభిప్రాయపడ్డారు.

మొత్తంగా విధి నిర్వహణ, నైపుణ్యాల విషయంలో గ్రేడ్​ ఏతో 26 శాతం, గ్రేడ్ బీతో​ 37 శాతం, గ్రేడ్​ సీతో 25 శాతం మంది ఉద్యోగులు తమ మేనేజర్​లను పాస్​ చేశారు.

భారతీయుల్లో సంతృప్తే..

పైఅధికారుల విషయంలో భారతీయ ఉద్యోగులు మాత్రం సంతృప్తిగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. అన్ని కేటగిరీల్లోని ప్రతి 10లో 8 మంది ఉద్యోగులు గ్రేడ్​ ఏ లేదా గ్రేడ్​ బీ ఇచ్చి వారి మేనేజర్లను పాస్ చేశారు.

ఇందుకు పూర్తి విరుద్ధంగా జర్మనీ, యూకేల్లో అన్ని కేటగిరీల్లో ఉద్యోగులు తమ మేనేజర్లకు అత్యల్ప ర్యాంకులను ఇచ్చారు. వారి మేనేజర్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమ పైఅధికారులకు అన్ని కేటగిరీల్లో ఉత్తమ స్థానం ఇచ్చినప్పటికీ.. 95 శాతం మంది భారతీయ ఉద్యోగులు తమ పైఅధికారి విధులను తాము అంతకన్నా సమర్థంగా నిర్వహిస్తామని అభిప్రాయపడ్డారు. వీరిలో 47 శాతం మంది అన్ని రకాల విధులను సమర్థంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేయగా.. 48 శాతం మంది కొన్ని పనుల్లో మాత్రమే వాటిని నిర్వహించ గలుగుతామని తెలిపారు.

మెక్సికోలో 87 శాతం మంది, ఫ్రాన్స్​లో 71 శాతం మంది ఉద్యోగులు తమ బాస్​ల ఉద్యోగం సమర్థంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కెనడాలో 61 శాతం, అమెరికాలో 59 శాతం మంది మాత్రం తమ మేనేజర్ల బాధ్యతలు నిర్వహించే విషయంలో తక్కువ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రానున్న 3 నెలలు ఉద్యోగ కల్పన అంతంతమాత్రమే!

AP Video Delivery Log - 0300 GMT News
Wednesday, 11 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0245: NKorea Projectile No access North Korea 4229383
NKorea confirms test of multiple rocket launcher
AP-APTN-0146: Brazil Democracy AP Clients Only 4229382
Bolsonaro's son questions Brazilian democracy
AP-APTN-0107: Paraguay Dictatorship AP Clients Only 4229380
Paraguay excavates to recover human remains
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.