ETV Bharat / business

'భారత్​కు టెస్లా'పై​ మస్క్ ట్వీట్ గేమ్స్​​- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకేనా?

author img

By

Published : Jan 13, 2022, 5:31 PM IST

Elon Musk about Tesla in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ట్వీట్స్​తో గేమ్​ ఆడుతున్నారా? వివాదాస్పద ట్వీట్లు చేసి భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్​లోకి టెస్లా కార్ల రాకపై తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్​ చర్చనీయాంశమైంది. అసలేమైందంటే?

Elon Musk
Elon Musk

Elon Musk about Tesla in India: భారత్​లో టెస్లా కార్ల ప్రవేశంపై.. ఆ సంస్థ సీఈఓ, వ్యవస్థాపకుడు ఎలాన్​ మస్క్​ సంచలన ట్వీట్​ చేశారు. 'ఇప్పటికీ ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు' పోస్ట్​ చేయగా.. ఇది చర్చనీయాంశమైంది. సవాళ్లు ఉన్నాయన్న మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఈ మేరకు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై మస్క్​ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సదరు ప్రభుత్వ అధికారులు విమర్శించారు. అయితే తాము ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గమని మస్క్​ వ్యాఖ్యలను తిప్పికొట్టినట్లు సమాచారం. భారత్​లో కార్ల తయారీకి కట్టుబడి ఉండకుండా.. కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించమని కోరడం సమంజసం కాదని అన్నట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

Tesla In India: భారత్​లో టెస్లా కార్ల విడుదల ఎప్పుడు? అని ట్విట్టర్ వేదికగా ఓ​ యూజర్​ మస్క్​ను అడిగాడు.

'భారత్​లో టెస్లా విడుదలపై ఏమైనా​ అప్​డేట్ ఉందా? టెస్లా కార్లు చాలా బాగుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఉండేందుకు వీటికి అర్హత ఉంది.' అని మస్క్​ను ట్యాగ్​ చేస్తూ సదరు నెటిజెన్​ ట్వీట్​ చేశాడు.

దీనికి స్పందించిన మస్క్​.. 'ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటికీ దీనిపై ప్రయత్నాలు చేస్తున్నాం' అన్నారు. ఈ ట్వీట్​ కాస్తా వైరల్​గా మారింది.

Elon Musk TESLA
నెటిజెన్​ ట్వీట్​కు మస్క్​ రిప్లై

సుంకాన్ని తగ్గిస్తేనే..

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామని తెలిపారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చిచెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ స్పందించింది. భారత్​లో తయారీ ప్రారంభించాకే సుంకాల తగ్గింపు విషయం పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏ కంపెనీకీ ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని తెలిపింది. టెస్లాకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందని వివరించింది. ఇప్పటికే భారత్‌లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టినవారికి ప్రతికూల సంకేతాలు అందుతాయని పేర్కొంది.

అయితే 2021 జనవరిలో భారత ఆటోమొబైల్​ మార్కెట్లోకి ప్రవేశించిందనే సంకేతాలు అందిస్తూ.. టెస్లా తన శాఖను బెంగళూరులో ప్రారంభించింది. టెస్లా ఇండియా మోటార్స్​ అండ్​ ఎనర్జీ ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో రిజిస్టర్​ అయినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది.

ఇవీ చూడండి: 2025 నాటికి భారత్‌లో 'టెస్లా' కార్ల ఉత్పత్తి!

టెస్లా నుంచి 'పై' స్మార్ట్‌ఫోన్‌.. ఇక అంతరిక్షం నుంచి హలో!

లెజెండ్స్​​ బైక్​ 'యెజ్​డీ' మళ్లీ వచ్చేసింది- ధరలు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.