ETV Bharat / business

అమెజాన్​ అధినేత ఓ కాపీ క్యాట్​: ఎలాన్​ మస్క్​

author img

By

Published : Jun 27, 2020, 7:28 PM IST

Updated : Jun 28, 2020, 11:42 AM IST

అమెరికాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలలో జెఫ్​ బెజోస్​, ఎలాన్​ మస్క్​లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరి రంగాల్లో వారు అద్భుతంగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరి మధ్య ప్రస్తుతం చిచ్చు రగులుతోందా.? అంటే అవునంటున్నారు కొందరు విశ్లేషకులు. తాజాగా 'బెజోస్ కాపీ క్యాట్​' అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్​ చేయడం ఆ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. మరి వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే.

musk calld amazon ceo as copycat
బిగ్​బాస్​ల మధ్య విభేదాలు

ప్రపంచంలోనే టాప్​​ పారిశ్రామికవేత్తల మధ్య విభేధాలు​ నడుస్తున్నాయి. ప్రస్తుతం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వారెవరంటే ఈ కామర్స్ దిగ్గజం, అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​ ఒకరు. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ మరొకరు.

తాజగాా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. జెఫ్​ బెజోస్​పై.. ఎలాన్​ మస్క్ ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి కారణమైంది.

అసలు విషయమిదే..!

టెస్లాలానే జూక్స్​ అనే స్టార్టప్​ కంపెనీ వాహనాల తయారీలో పలు ప్రయోగాలు చేస్తోంది. రోబోలు, పునరుత్పాదక విద్యుత్ సహా పలు సాంకేతికల ఆధారంగా నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తోందీ సంస్థ. అయితే ఇప్పుడు ఆ అంకుర సంస్థను 1 బిలియన్ డాలర్లతో.. జెఫ్ బెజోస్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బెజోస్​పై విమర్శనాత్మక ట్వీట్​ చేశారు ఎలాన్ మస్క్.

"జెఫ్​ బెజోస్​ ఒక కాపీ [క్యాట్].." అని ట్వీట్ చేశారు. దానికి జూక్స్​ను బెజోస్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన ఓ కథనాన్ని ట్యాగ్​ చేశారు. అయితే మస్క్ ట్వీట్​పై జెఫ్​బెజోస్​ ఇంత వరకు స్పందించలేదు.

గతంలో కూడా అమెజాన్ గుత్తాధిపత్యానికి బ్రేకప్ చెప్పాల్సిన సమయం వచ్చింది అంటూ మస్క్ ట్వీట్​ చేయడం చర్చనీయాంశమైంది.

  • Time to break up Amazon. Monopolies are wrong!

    — Elon Musk (@elonmusk) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జూక్స్​తో టెస్లా వివాదం..

టెస్లా, జూక్స్​ మధ్య గతంలో ఓ వివాదం ఉంది. తమ మాజీ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా లాక్కుందనే ఆరోపణలతో.. జూక్స్​పై దావా వేసింది టెస్లా. ఈ కేసులో జూక్స్ సంస్థ టెస్లాకు పెనాల్టీ కూడా చెల్లించింది.

ఇదీ చూడండి:'భారత్‌లో 'గూగుల్‌ పే'ను నిషేధించలేదు'

Last Updated : Jun 28, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.