ETV Bharat / business

64 మెగా పిక్సెల్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? - బిజినెస్​ వార్తలు

భారత్​లో స్మార్ట్​ ఫోన్​ కంపెనీల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నడుస్తోంది. ఒక సంస్థ కొత్త మోడల్ విడుదల చేసిన వెంటనే దానికి పోటీగా ప్రత్యర్థి సంస్థలు తమ మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ పోటీ ఎక్కువగా ఉంటోంది. ఆ పోటీ ఎలా ఉంది.. ఇందులో ఏఏ సంస్థలు ప్రధానంగా ఉన్నాయి.. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 64 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్​ఫోన్ల వివరాలు మీ కోసం.

CAMERA
64 మెగా పిక్సెల్ కెమెరా​ స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా?
author img

By

Published : Dec 5, 2019, 9:35 AM IST

మొబైల్​ ఫోన్ కంపెనీల మధ్య ప్రస్తుతం కెమెరాల యుద్ధం నడుస్తోంది. కెమెరాల సంఖ్యతో పాటు.. రిజల్యూషన్​ వంటి ఫీచర్లపై కంపెనీలు ఎక్కువగా పోటీ పడుతున్నాయి.

2012 సంవత్సరం నుంచి మొదలైన ఈ ట్రెండ్.. మధ్యలో కాస్త తగ్గింది. ఈ ఏడాది 48 మెగా పిక్సెల్​ కెమెరాతో మళ్లీ పోటీ ఊపందుకుంది. ఇప్పుడు 64 మెగా పిక్సెల్​తో సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం భారత్​లో 64 మెగా పిక్సెల్​ రియర్​ కెమెరాతో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ.14,990తో ప్రారంభం అవుతుండటం గమనార్హం. ఇంతకీ ఆ మోడళ్లు ఏవి.. వాటి ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలు మీకోసం.

రియల్​మీ ఎక్స్​టీ..

భారత్​లో 48 ఎంపీ రియర్​ కెమెరా స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసిన సంస్థగా 'హానర్'​ నిలిచింది. అయితే హానర్​ సహా.. షియోమీ, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తూ రియల్​మీ ఏకంగా 4 కెమెరాలు 64 మెగా పిక్సెల్​తో కొత్త స్మార్ట్​ ఫోన్​ను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో.. 'రియల్​ మీ ఎక్స్​టీ' పేరుతో ఈ మోడల్​ మార్కెట్​లోకి వచ్చింది.

realmext
రియల్​మీ ఎక్స్​టీ..

ఎక్స్​టీ ఇతర ఫీచర్లు..

ఈ స్మార్ట్​ ఫోన్​​ 4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజీ వేరియంట్​లలో అందుబాటులోకి తెచ్చింది రియల్​మీ. వీటి ధరలు వరుసగా రూ.15,999, రూ.16,999, రూ.18,999 గా నిర్ణయించింది.

  • 6.4 అంగుళాల ఆమోలెడ్​ డిస్​ప్లే
  • ఇన్​-డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​
  • స్నాప్​డ్రాగన్ 712 ప్రాసెసర్
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

రెడ్​మీ నోట్ 8 ప్రో

రియల్​ మీ ఎక్స్​టీకి పోటీగా అక్టోబర్​లో రెడ్​మీ నోట్​8 ప్రోను విడుదల చేసింది షియోమీ. వెనుక వైపు నాలుగు కెమెరాలతో (64 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ).. ఈ మోడల్​ను విడుదల చేసింది.

redmi
రెడ్​మీ నోట్ 8 ప్రో

ఈ మోడల్​ ఇతర ఫీచర్లు..

  • 4జీబీ ర్యామ్​-64 జీబీ స్టోరేజి​ ​ వేరియంట్​.. ధర రూ.14,999
  • 6 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి​ ​ వేరియంట్.. ధర రూ.15,999
  • 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి​ వేరియంట్.. ధర రూ.17,999
  • 6.58 అంగుళాల పూర్తి హెచ్​డీ, డాట్​ నాచ్​ డిస్​ప్లే..
  • గొరిల్లా గ్లాస్ 5 రక్షణ
  • 20 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా
  • మీడియా టెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్
  • లిక్విడ్​ కూలింగ్​ వ్యవస్థ
  • అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ (బిల్ట్​ ఇన్​)
  • అండ్రాయిడ్​ 9 పై ఆపరేటింగ్ వ్యవస్థ
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

రియల్​ మీ ఎక్స్​2 ప్రో..

తొలుత మిడ్​ రేంజ్​ నుంచి ప్రీమియం ఫోన్​లో 64 ఎ పీల రియర్​ కెమెరా ఫోన్​ను విడుదల చేసిన రియల్​ మీ.. నవంబర్​లో పూర్తి ప్రీమియం మోడల్​ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్​మీ ఎక్స్​2 ప్రోగా ఈ మెడల్​ను భారత్​ మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో (64+13+8+20) క్వాడ్​ కెమెరా సెటప్​ను ఉంచింది.

8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజి, 12జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజీ వేరియంట్​తో పాటు.. ఓ ప్రత్యేక ఎడిషన్​ను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.29,999, రూ.33,999, రూ.34,999గా నిర్ణయించింది.

realme
రియల్​ మీ ఎక్స్​2 ప్రో..

ఇతర ఫీచర్లు..

6.50 అంగుళాల డిస్​ప్లే
స్నాప్​డ్రాగన్ 855+ ప్రోసెసర్​
50 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​
4,000 ఎంఏహెచ్​ బ్యాంటరీ
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 9పై ఓఎస్​

శాంసంగ్​ గెలాక్సీ ఏ 70ఎస్

48 మెగా పిక్సెల్​ కెమెరా ఫోన్లలో గట్టిపోటీ ఇచ్చిన శాంసంగ్​.. ఇటీవల 64 ఎంపీ కెమెరా పోటీలోకి ప్రవేశించింది. అయితే.. మూడు కెమెరాల(64 + 8 + 5).. రేంజ్​లో ఈ ఫోన్​ను తీసుకువచ్చింది శాంసంగ్. రియల్​ మీ ఎక్స్​2 ప్రో మోడల్​కు పోటీగా.. ప్రీమియం సెగ్మెంట్​లో ఈ స్మార్ట్​ ఫోన్​ను ఆవిష్కరించింది శాంసంగ్​.

6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజీల్లో ఈ మోడల్​ అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా.. రూ.28,999, రూ.30,999గా నిర్ణయించింది.

samsung
శాంసంగ్​ గెలాక్సీ ఏ 70ఎస్

ఇతర ఫీచర్లు..

  • 6.7 అంగుళాల డిస్​ప్లే.. వాటర్​ డ్రాప్​ నాచ్​
  • 32 ఎంపీల సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • స్నాప్​డ్రాగన్ 675 ప్రాసెసర్​

పోటీ మరింత తీవ్రం..

ఈ పోటీని మరింత తీవ్ర చేసేందుకు శాంసంగ్. త్వరలోనే హై రెజల్యూషన్​ 60 ఎంపీ ఐఎంఎక్స్ 686 కెమెరా ఫోన్​ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఐఎంఎక్స్ 686తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. రెడ్​ మీ ఏకంగా 108 మెగా పిక్సెల్​ల కెమెరాను తీసుకురానుంది.

నవంబర్​ 5న 'ఎమ్​ఐ సీసీ9 ప్రో' పేరుతో ఈ ఫోన్​ను చైనాలో విడుదల చేసింది షియోమీ. తరువాత దాని గ్లోబర్ వెర్షన్​ 'ఎమ్​ఐ నోట్​ 10' స్మార్ట్​ఫోన్​ను నవంబర్​ 14న పోలాండ్​లో ఆవిష్కరించారు. ఈ నెలలోనే ఈ మోడల్​ భారత్​కు వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి:రెపో రేటు తగ్గేనా?.. నేడే ఆర్బీఐ కీలక ప్రకటన

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 4 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2159: Haiti Weapons AP Clients Only 4243172
Haiti: authorities arrest former lawmaker
AP-APTN-2158: US CA Weather Traffic Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4243171
Rain snarls traffic in Southern California
AP-APTN-2143: Colombia Strike 2 AP Clients Only 4243170
Tens of thousands protest against Colombia president
AP-APTN-2048: France Strike Transport AP Clients Only 4243162
French transport minister on Thursday's strike
AP-APTN-2046: Archive Zimmerman Martin AP Clients Only 4243161
Zimmerman sues Trayvon Martin's family, attorneys
AP-APTN-2019: Mexico US Weapons AP Clients Only 4243159
Mexico to talk weapon smuggling when US AG visits
AP-APTN-2017: Portugal Pompeo Netanyahu AP Clients Only 4243158
Netanyahu meets Pompeo, calls for pressure on Iran
AP-APTN-2006: US MI Kid Rock Race AP Clients Only 4243157
Activists denounce Kid Rock's tirade against Oprah
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.