ETV Bharat / business

క్యూ2లో డీమార్ట్ ఆదాయం 46.6% వృద్ధి - అవెన్యూ సూపర్​మార్ట్స్​ లాభం

'డీమార్ట్' పేరిట రిటైల్​ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్​​ 2021-22 క్యూ2లో (Dmart results) దూకుడు ప్రదర్శించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే.. తమ ఆదాయం 46.6 శాతం (Dmart revenue) పెరిగినట్లు అవెన్యూ సూపర్ మార్ట్స్​​ ప్రకటించింది.

Dmart
డిమార్ట్​
author img

By

Published : Oct 3, 2021, 3:18 PM IST

ప్రముఖ రిటైల్ సూపర్​ మార్కెట్​ 'డీమార్ట్'​ మాతృ సంస్థ అవెన్యూ సూపర్​ మార్ట్స్​ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,649 కోట్ల ఆదాయాన్ని(Dmart revenue) గడించినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ మొత్తం 46.6 శాతం ఎక్కువని తెలిపింది.

2020-21 రెండో త్రైమాసికంలో అవెన్యూ సూపర్​ మార్ట్స్​ ఆదాయం రూ.5,218.15 కోట్లుగా ఉంది.

సెప్టెంబర్​ 30 నాటికి దేశవ్యాప్తంగా 246 రిటైల్ స్టోర్లు ఉన్నట్లు వెల్లడించింది అవెన్యూ సూపర్​ మార్ట్స్​​. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, గుజరాత్​, మధ్య ప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్, దిల్లీ ఎన్​సీఆర్​, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్​ రాష్ట్రాల్లో తమ స్టోర్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది.

అవెన్యూ సూపర్​ మార్ట్స్​​కు ప్రముఖ ఇన్వెస్టర్​, వ్యాపారవేత్త రాధా కృష్ణ దమానీ, ఆయన కుటుంబం ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫ్లిప్​కార్ట్, అమెజాన్​ పోటాపోటీ ఆఫర్లు- బెస్ట్​ డీల్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.