ETV Bharat / business

స్పైస్​జెట్ ఉద్యోగులకు ఏప్రిల్ వేతనంలో కొంత చెల్లింపు

లాక్​డౌన్ కారణంగా ప్రయాణ విమాన సేవలు పూర్తిగా రద్దయ్యాయి. నష్టాల్లోకి వెళ్లిన కారణంగా ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత విధిస్తున్నాయి విమానయాన సంస్థలు.  ఈ నేపథ్యంలో స్పైస్​జెట్ సంస్థ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల్లో కొంత మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి ఏ ఒక్కరిని తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

SpiceJet
స్పైస్ జెట్ ఉద్యోగులకు ఊరట
author img

By

Published : Apr 30, 2020, 4:41 PM IST

Updated : Apr 30, 2020, 5:06 PM IST

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్​డౌన్ కారణంగా సుమారు నెల రోజులకుపైగా ప్రయాణ విమానాల సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా తమ ఆదాయం కూడా తగ్గిందని పేర్కొంది స్పైస్ జెట్. ఆ కారణంగా 92 శాతం మంది ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు సంబంధిన జీతాల్లో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఎవరినీ ఉద్యోగాల్లోంచి తొలగించడం లేదని స్పష్టం చేసింది.

''ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో మా ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి పని గంటలకు అనుగుణంగా అందరికి జీతాలు చెల్లించేందుకు ఓ విధానాన్ని రూపొందించాం. ప్రపంచ వ్యాప్తంగా పలు విమానయాన సంస్థలు తమ ఉద్యోగులను వదిలించుకోవడం, జీతాల్లో కోత విధించటం చేస్తున్నాయి. లాక్​డౌన్ సమయంలో కార్గో విమానాల సేవల వల్ల 92 శాతం మంది ఉద్యోగులకు జీతాల్లో కొంత మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాం.''

- స్పైస్ జెట్

మరోవైపు.. పైలెట్లకు మాత్రం ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీతాలను చెల్లించబోమని బుధవారమే వెల్లడించింది. అయితే.. కార్గో విమానాల్లో పని చేసిన పైలట్లకు పని గంటలకు అనుగుణంగా చెల్లించనున్నట్ల స్పష్టం చేసింది. గత మార్చి నెలలో సీనియర్, మధ్య తరగతి ఉద్యోగుల జీతాల్లో సుమారు 10-30 శాతం వరకు కోత విధించింది.

స్పైస్ జెట్ మాదిరిగానే.. ఎయిర్ ఇండియా 10 శాతం జీతాల్లో కోత విధించగా, గోఎయిర్.. తమ ఉద్యోగులను సెలవుపై పంపింది. ఎయిర్ ఏసియా ఇండియా తమ సీనియర్ ఉద్యోగుల జీతాల్లో 20 శాతం కోత విధించగా.. విస్తారా తమ సీనియర్ ఉద్యోగులను సెలవుపై పంపింది. మరోవైపు.. ఇండిగో జీతాల కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో భారతీయుల బలాన్ని ప్రదర్శించారు'

Last Updated : Apr 30, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.