ETV Bharat / business

అక్టోబర్​లో.. కీలక రంగాల ఉత్పత్తి 5.8 శాతం తగ్గుదల - ఆర్థిక మాంద్యం

దేశంలోని ఎనిమిది ప్రధాన మౌలిక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్​ నెలలో 5.8 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయానికి ఈ కీలక రంగాలు 4.8 శాతం వృద్ధిని నమోదుచేశాయి. దీనిని అనుసరించి చూస్తే దేశంలో ఆర్థికమందగమనం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

INFRA
అక్టోబర్​లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 5.8 శాతమే!
author img

By

Published : Nov 29, 2019, 7:34 PM IST

Updated : Nov 29, 2019, 11:02 PM IST

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్​లో... ఎనిమిది ప్రధాన మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.8 శాతం తగ్గింది. ఇది దేశంలో ఆర్థికమందగమనం తీవ్రతను సూచిస్తోంది. గతేడాది ఇదే కాలానికి ఈ కీలక రంగాలు 4.8 శాతం వృద్ధిని నమోదుచేయడం గమనార్హం.

ఉత్పత్తుల తగ్గుదల

అక్టోబర్​లో.. ఎనిమిది ప్రధాన పరిశ్రమల్లోని ఆరింట్లో ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి 17.6 శాతం తగ్గగా.. ముడిచమురు 5.1 శాతం పతనమైంది. సహజవాయువు ఉత్పత్తిలో 5.7 శాతం తగ్గుదల నమోదైంది.

అక్టోబర్​లో.. సిమెంట్​ ఉత్పత్తి 7.7 శాతం, స్టీల్​ 1.6 శాతం, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి 12.4 శాతం మేర పతనమయ్యాయి.

ఆర్థికరంగానికి..ఎరువు

అక్టోబర్​లో వృద్ధిని నమోదుచేసిన ఏకైక రంగం ఎరువులు. ఈ మాసంలో ఎరువుల ఉత్పత్తి 11.8 శాతం పెరిగింది.

రిఫైనరీ ఉత్పత్తులు... గతేడాది ఇదే కాలానికి 1.3 శాతంగా ఉంటే.. ఈసారి 0.4 శాతం పతనాన్ని నమోదుచేశాయి.

ఏప్రిల్​- అక్టోబర్ మధ్య

ఏప్రిల్- అక్టోబర్​ మధ్య కాలంలో ఈ ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి 0.2 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ఈ రంగాల ఉత్పత్తి 5.4 శాతంగా ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 29, 2019, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.