ETV Bharat / business

డీజిల్​ మోడళ్ల కొనసాగింపునకే హ్యుందాయ్​ మోటర్స్ మొగ్గు - కార్ల తయారీ సంస్థ

బీఎస్​-6 ఉద్గారాల నియమాలు అమలులోకి వచ్చిన క్రమంలో డీజిల్​ వాహనాలకు స్వస్తి పలకాలని మారుతీ సుజూకీ వంటి దేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్​-6 వేరియంట్లలోనూ డీజిల్​ వాహనాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది హ్యుందాయ్​ మోటర్స్​ ఇండియా. ప్రస్తుతం డీజిల్​ వాహనలకు వస్తున్న ఆదరణే తమ వైఖరి సరైనదని నిరూపిస్తోందని పేర్కొన్నారు ఆ సంస్థ సీనియర్​ అధికారి ఒకరు.

Hyundai motors
హ్యుందాయ్​ మోటర్స్​ ఇండియా
author img

By

Published : Nov 15, 2020, 8:15 PM IST

తమ పోర్ట్​ఫోలియోలో డీజిల్​ మోడళ్లకు బలమైన డిమాండ్​ను సాధిస్తున్నట్టు హ్యుందాయ్​ మోటర్స్​ ఇండియా తెలిపింది. బీఎస్​-6 ఉద్గారాల మోడళ్లలోనూ అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనసాగించాలనే తమ వైఖరి సరియైనదేనని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని కంపెనీ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి బీఎస్​-6 ఉద్గార నియమాలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో డీజిల్​ మోడళ్లకు స్వస్తి పలకాలని దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజూకీ నిర్ణయించింది. అయితే, దేశ రెండో అతిపెద్ద ప్రయాణ వాహనాల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్​ మోటర్స్​.. తమ పోర్ట్​ఫోలియోలో డీజిల్​ వాహనాల ఉత్పత్తిని కొనసాగించాలని నిర్ణయించటం గమనార్హం.

పలు వాహన తయారీదారులు డీజిల్​ వాహనాలు, ముఖ్యంగా చిన్న కెపాసిటీ ఇంజిన్​ల ఉత్పత్తిని నిలిపేయాలని నిర్ణయించాయి. చిన్న డీజిల్​ కార్లు ఖరీదైనవిగా మారి, తొలిసారి కారు కొనాలనుకునే వారికి ప్రియంగా మారుతాయని భావిస్తుండటమే ఇందుకు కారణం. టాటా మోటర్స్​, టయోటా కిర్లోస్కర్​ వంటి సంస్థలు ఇప్పటికే చిన్న సామర్థ్యం గల డీజిల్​ ఇంజిన్లను పక్కనపెట్టాయి. బహుళ ప్రయోజన వాహనాలు, ఎస్​యూవీల్లో అధిక సామర్థ్యం గల పవర్​ట్రైన్స్​ ఇంజిన్లనే వినియోగిస్తున్నాయి.

డీజిల్​ వాహనాలకే జై..

క్రేటాలో ఇప్పటికీ 60 శాతం మంది డీజిల్​ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు హ్యుందాయ్​ మోటర్స్​ డైరెక్టర్​ (సెల్స్​, మార్కెటింగ్​, సర్వీస్​) తరుణ్​ గార్గ్​. వెన్యూ, వెర్నా వాహనాల్లోనూ 33శాతం మంది వినియోగదారులు డీజిల్​ కార్లనే కోరుకుంటున్నట్లు తెలిపారు.

"గత 10ఏళ్లుగా డీజిల్​ వాహనాలకు భారత్​ అతిపెద్ద మార్కెట్​. వినియోగదారులు ఆహ్లాదకరమైన డ్రైవింగ్​, అధిక మైలేజ్​, అధిక సామర్థ్యాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఆ​ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. డీజిల్​ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు అకస్మత్తుగా ఎక్కడికి వెళతారు? అదే విషయాన్ని హ్యుందాయ్​ గమనించింది. మేము విక్రయిస్తున్న వాహనాల సంఖ్యనే మా వైఖరి సరైందని నిరూపిస్తోంది."

- తరుణ్​ గార్గ్​, హ్యుందాయ్​ మోటర్స్​ డైరెక్టర్​

డీజిల్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉన్న దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోందన్నారు గార్గ్​. మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ వంటి రాష్ట్రాలు డీజిల్​ వాహనాలకు బలమైన మార్కెట్లుగా పేర్కొన్నారు. వినియోగదారులకు తమ వాహనాన్ని ఎంచుకునే అవకాశాన్ని సంస్థ కల్పించగలగుతుందనే నమ్ముతున్నట్లు తెలిపారు. కస్టమర్ల ఆలోచనకు తగ్గట్టుగా పెట్రోల్​, డీజిల్​, టర్బో, సీఎన్జీల వేరియంట్లలో అందించటం ద్వారా, తమ లక్ష్యాన్ని సాదించగలుగుతామన్నారు.

హ్యుందాయ్​ మోటర్స్​ ప్రస్తుతం దాని ఉత్పత్తి శ్రేణిలో 1.2 లీటర్లు, 1.5 లీటర్లు, 2 లీటర్ల కెపాసిటీ ఇంజిన్లతో సహా బీఎస్​-6 కంప్లైంట్​ డీజిల్​ పవర్​ట్రైన్​లను ఉపయోగిస్తోంది. సంస్థ ఇటీవల విడుదల చేసిన ఐ20లో కూడా 1.5 లీటర్ల ఇంజిన్​ కలిగి ఉంది. ఐ20 విక్రయాల్లో 50 శాతం డీజిల్​ వాహనాలే. కొత్త ఇంజిన్​, పవర్​ట్రైన్​ అవకాశాలతో వినియోగదారులకు మరింత చేరువవుతామని సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి: మార్కెట్లోకి ఐ20 కొత్త మోడల్​- ధర, ఫీచర్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.