ETV Bharat / business

'తక్కువ ధర విద్యుత్ కార్ల తయారీకి కృషి'

భారత్​లో తక్కువ ధరలో విద్యుత్ వాహనాల తయారీకి ఆటోమోబైల్ దిగ్గజం హ్యుందాయ్​తో కలిసి పని చేయనున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. ఇప్పటికే ఈ రెండు సంస్థలు కలిసి రానున్న రెండేళ్లలో 4 మోడళ్లను అవిష్కరించనున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ విద్యుత్ వాహనాల ఒప్పందం మరో కొత్త ప్రాజెక్టు కానున్నట్లు కియా మోటార్స్ తెలిపింది.

కియా మోటార్స్
author img

By

Published : Jun 23, 2019, 5:50 PM IST

దక్షిణకొరియా ఆటోమోబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత్​లో తక్కువ ధరలో విద్యుత్ వాహనాల తయారీకి కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం మరో వాహన దిగ్గజం హ్యుందాయ్​తో సంయుక్తంగా పని చేయనున్నట్లు పేర్కొంది.

విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన "ఫేమ్​2" పథకం ద్వారా వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావాలని భావిస్తున్నట్లు కియా మోటార్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

హ్యుందాయ్​తో కలిసి త్వరలో ఆవిష్కరించనున్న ఎస్​యూపీ సెల్టర్స్ సహా మొత్తం 4 మోడళ్లను రెండేళ్లలో ఆవిష్కరించనుంది కియా మోటార్స్. అయితే విద్యుత్ వాహనాల ఒప్పందం మరో కొత్త ప్రాజెక్టు కానుందని పేర్కొంది.

"ప్రస్తుతం మేము భారత్​లో తక్కువ ధరలో విద్యుత్ వాహనాలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం హ్యుందాయ్​తో కలిసి మా ప్రయత్నాన్ని కొనసాగించాలకుంటున్నాం." ---హాన్​ వూ-పార్క్, కియా మోటార్స్​, అధ్యక్షుడు

కియా మోటార్స్ ఇప్పటికే హైబ్రీడ్, ప్లగ్​ ఇన్-హైబ్రీడ్​, విద్యుత్​, ఇంధన సెల్​ వాహనాలను ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు పార్క్​. వాటిని భారత్​లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.. అయితే అందుకు మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమని తెలిపారు. అవి సమకూరితే ఏ సమయంలోనైనా విద్యుత్​ వాహనాలు భారత్​కు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Intro:Body:

we

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.