ETV Bharat / business

రిలయన్స్ రిటైల్​లోకి మరో భారీ పెట్టుబడి! - రిలయన్స్ రిటైల్​లో కార్లైల్ గ్రూప్ భారీ పెట్టుబడి

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్​లోకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్​ రిటైల్ వ్యాపారంలో.. కార్లైల్ గ్రూప్ దాదాపు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Carlyle group investment in Reliance retail
రిలయన్స్ రిటైల్​లో కార్లైల్ గ్రూప్ భారీ పెట్టుబడి
author img

By

Published : Sep 14, 2020, 10:45 AM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్​ రిటైల్ వ్యాపారంలోకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ గ్రూప్ 1.5-2 బిలియన్ డాలర్ల మేర రిలయన్స్ రిటైల్​లో పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు చెప్పారు.

ఈ ఒప్పందం ఖరారైతే భారత రిటైల్​ రంగంలో కార్లైల్ గ్రూప్ మొదటి పెట్టుబడి ఇదే కానుంది. దీనితో పాటు రిటైల్ వ్యాపారాల్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద పెట్టుబడి కానుంది.

భారత్​లో ఆన్​లైన్, ఆఫ్​లైన్​ రిటైల్​ వ్యాపారాల్లో కార్లైల్​ గ్రూప్ పెట్టుబడికి పెట్టేందుకు ప్రణాళిలకు వేస్తోందని.. ఇందులో భాగంగానే రిలయన్స్​లో వాటా కొనుగోలును అంశాన్ని పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పటికే సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ రిటైల్ వ్యాపారాల్లో రూ.7.5వేల కోట్ల పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకుంది.

దీనితో పాటు రిలయన్స్​, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మధ్య 20 బిలియన్ డాలర్ల డీల్​కు ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇవీ చూడండి:

ఆ ఒప్పందం జరిగితే.. రిలయన్స్​కు లాభం ఏంటి?

అమెజాన్​తో రిలయన్స్​ 2వేల కోట్ల డాలర్ల డీల్​!

రిలయన్స్​లో సిల్వర్​ లేక్​ పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.