ETV Bharat / business

టిక్​టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!

author img

By

Published : Aug 13, 2020, 1:17 PM IST

చైనాకు చెందిన షార్ట్​ వీడియో యాప్​ టిక్​టాక్ కొనుగోలు రేసులోకి మరో దిగ్గజ కంపెనీ చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికా టెక్​ దిగ్గజాలు మాత్రమే ఈ రేసులో ఉండగా.. ఇప్పుడు భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్​ ప్రవేశించినట్లు సమాచారం. ఈ మేరకు రిలయన్స్ .. బైట్​ డ్యాన్స్​తో చర్చలు జరుపుతున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది.

reliance want to buy titok
టిక్​ టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్

భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్ వ్యాపారాలను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్​డ్యాన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్​కు టిక్​టాక్ ఇండియా​ను విక్రయించేందుకు బైట్​డ్యాన్స్​ ఆసక్తి చూపుతున్నట్లు ​టెక్​ క్రంచ్ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ఇరు సంస్థలు జులై చివరి వారం నుంచే చర్చలు ప్రారంభించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇంకా ఈ ఒప్పందం గురించి ఇరు సంస్థలు తుది నిర్ణయానికి రాలేదని పేర్కొంది.

మైక్రోసాఫ్ట్-టిక్​ టాక్ డీల్​ కష్టమే?

మరోవైపు టిక్​టాక్ అమెరికా సహా అంతర్జాతీయ వ్యాపారాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్​ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే టిక్​టాక్​ను తక్కువ విలువకే దక్కించుకోవాలని మైక్రోసాఫ్ట్​ భావిస్తోందని.. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు లేవని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బైట్​డ్యాన్స్​- రిలయన్స్ ఒప్పందంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

టిక్​టాక్​ కొనుగోలు కోసం.. మరో టెక్​ దిగ్గజం ట్విట్టర్​ కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

టిక్​టాక్​ నిషేధం ఎందుకు?

దేశీయ వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు ఉన్న కారణంతో టిక్​టాక్​ సహా మొత్తం 59 చైనా యాప్​లపై కేంద్రం నిషేధం విధించింది.

బ్యాన్​ అయ్యే సమయానికి టిక్​టాక్​కు దేశంలో మొత్తం 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అదే సమయానికి టిక్​టాక్​కు 3 బిలియన్​ డాలర్ల మార్కెట్​ విలువ ఉన్నట్లు అంచనా.

ఇదీ చూడండి:నాలుగేళ్ల తర్వాత ఫోన్ల మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.