ETV Bharat / business

వైదొలగనున్న టాటా మోటర్స్​ సీఈఓ బుషెక్​

author img

By

Published : Jun 24, 2021, 9:13 AM IST

Updated : Jun 24, 2021, 11:58 AM IST

వ్యక్తిగత కారణాలతో తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు టాటా మోటర్స్​ సీఈఓ బుషెక్​ తెలిపారని సంస్థ ప్రకటించింది. జూన్​ 30న బాధ్యతల నుంచి వైదొలిగినప్పటికీ.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు సంస్థకు కన్సల్టంట్​గా కొనసాగుతారని తెలిపింది.

Tata motors
టాటా మోటార్స్​

టాటా మోటర్స్​ ఎండీ, సీఈఓ గుంటెక్​ బుషెక్​ జూన్​ 30న తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే సంస్థకు కన్సల్టంట్​గా ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఆయన కొనసాగుతారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా గిరీశ్​ వాగ్​ను ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

'వ్యక్తిగత కారణాల వల్ల జర్మనీకి వెళ్లాలని అనుకుంటున్నందున, కాంటాక్ట్​ ముగిసిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకుంటానని బుషెక్​ సమాచారం ఇచ్చారు. జూన్​ 30, 2021 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన ఎండీ, సీఈఓ పదవుల నుంచి వైదొలుగుతారు' అని టాటా మోటర్స్​ ఒక ప్రకటనలో పేర్కొంది.

'గత ఐదేళ్లుగా కంపెనీకి విజయవంతంగా నేతృత్వం వహించినందుకు బుషెక్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. కంపెనీ కన్సల్టంట్​గా ఆయన తన సేవలను కొనసాగించడంపై వేచిచూస్తున్నాన'ని టాటా మోటర్స్​ ఛైర్మన్​ ఎన్​.చంద్రశేఖర్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: JAMSETJI TATA: దాతృత్వంలో జెంషెట్​ జీ టాటాదే అగ్రస్థానం!

Last Updated : Jun 24, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.