ETV Bharat / business

పద్దుపై ఆశలు నిరాశలై... కుదేలైన సూచీలు

author img

By

Published : Jul 5, 2019, 5:55 PM IST

బడ్జెట్​పై అసంతృప్తితో అమ్మకాల ఒత్తిడి పెరిగి నేడు భారీ నష్టాలతో ముగిశాయి స్టాక్​ మార్కెట్లు. ఆరంభ లాభాలతో 40,000 మార్క్​ను దాటిన సెన్సెక్స్​.. ముగింపు సమయానికి 395 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 11,900 మార్కును కోల్పోయింది.

పద్దుపై ఆశలు నిరాశలై... కుదేలైన సూచీలు

మదుపరుల్లో బడ్జెట్​పై నెలకొన్న అసంతృప్తి కారణంగా స్టాక్ మార్కెట్లు నేడు భారీగా కుంగాయి. బ్యాంకింగ్ రంగంలోని కొన్ని సంస్థలు తప్ప.. మిగతా రంగాలన్నీ దాదాపుగా నష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్​ రంగానికి మూల ధన సహాయం కింద రూ.70,000 కోట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫలితంగా బ్యాంకింగ్ షేర్లు మాత్రమే కాస్త రాణించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 395 పాయింట్లు నష్టపోయింది. చివరకు 39,513 వద్ద స్థిర పడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 11,811 వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ నేటి సెషన్ మొత్తం 39,441-40,032 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ నేడు 11,964 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఒకానొక దశలో 11,881 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.

ఇవీ కారణాలు

కేంద్ర బడ్జెట్-2019పై మార్కెట్ వర్గాలు కొండంత ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రూ.1,05,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు మంత్రి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో ఈ మొత్తాలు రూ.90,000 కోట్లుగా మాత్రమే ఉన్నాయి.

పెట్రోలుపై ఒక రూపాయి ఎక్సైజ్​ సుంకం పెంచడం, బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం వంటి నిర్ణయాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

లాభనష్టాల్లోనివివే...

ఇండస్ఇండ్ బ్యాంకు 2.16 శాతం, కోటక్ బ్యాంకు 1.17 శాతం, ఎస్​బీఐ 0.90 శాతం, ఐటీసీ 0.63 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.62 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.13 శాతం లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ ఆరు షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.

నష్టాల జాబితాలో ఎస్​ బ్యాంకు అధికంగా 8.36 శాతం, ఎన్​టీపీసీ 4.81 శాతం, ఎం&ఎం 4.41 శాతం, వేదాంత 4.41 శాతం, సన్​ ఫార్మా 4.34 శాతం, టీసీఎస్​ 3.61 శాతం నష్టపోయాయి.

రూపాయి, ముడి చమురు

ఒడుదొడుకుల నడుమ రూపాయి నేడు స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68.52 వద్ద ఉంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.52 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 63.63 డాలర్లుగా ఉంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లయిన.. చైనా, జపాన్, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చూడండి: బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం

Intro:Body:

o

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.