ప్రైవేటు టెలికం రంగ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పోటీ పడుతూ ఆఫర్లు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో జోరును ఆపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. జియో జిగా ఫైబర్‌ను తీసుకొచ్చే ముందే బీఎస్ఎన్ఎల్ నెట్ వేగాన్ని పెంచుతూ సరి కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆఫర్లతో పాటు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలైన అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ సర్వీసులను ఉచితంగా అందిస్తోంది.
జులై 1 నుంచి కొత్త ఆఫర్లతో దూసుకుపోతోంది బీఎస్ఎన్ఎల్. మొత్తం 7 ప్లాన్లను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్.
రీఛార్జ్ వివరాలు...
- నెలకు రూ.349 రీఛార్జ్ చేస్తే రోజుకు 8 ఎమ్‌బీపీఎస్ వేగంతో 2జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్.
- నెలకు రూ.599 రీఛార్జ్ చేస్తే రోజుకు 10 ఎమ్‌బీపీఎస్ వేగంతో 4జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్.
- నెలకు రూ.699 రీఛార్జ్ చేస్తే రోజుకు 10 ఎమ్‌బీపీఎస్ వేగంతో 5జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్.
- నెలకు రూ.749 భారత్ ఫైబర్ ప్లాన్‌కు రీఛార్జ్ చేస్తే రోజుకు 50 ఎమ్‌బీపీఎస్ వేగంతో 300జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్. వీటితో పాటు అదనంగా హాట్‌స్టార్ సర్వీసును ఏడాది పాటు ఉచితంగా ఇస్తుంది.
- నెలకు రూ.849 ఫైబర్ ప్లాన్‌కు రీఛార్జ్ చేస్తే రోజుకు 50 ఎమ్‌బీపీఎస్ వేగంతో 600 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్. వీటితో పాటు అదనంగా అమెజాన్ ప్రైమ్ సర్వీసును ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
- చివరిగా రూ.899, రూ. 999 బ్రాండ్‌బాండ్ ప్లాన్ వేసుకుంటే రోజుకు 12జీబీ, 15జీబీ డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్. అలానే అమెజాన్ ప్రైమ్ సర్వీసును ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
వీటితో పాటు మరి కొన్ని పెద్ద ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది.
- ఇదీ చూడండి: 64 ఎమ్పీ సూపర్ కెమెరాతో షామీ ఫోన్