ETV Bharat / business

కరోనాపై పోరుకు అదాని గ్రూప్స్​​ భారీ విరాళం

author img

By

Published : Apr 5, 2020, 6:17 AM IST

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు అదాని గ్రూప్​ తమ వంతు సాయంగా నిలిచింది. పీఎం రిలీఫ్​ ఫండ్​కు రూ.100కోట్ల విరాళం ప్రకటించింది. సంస్థలోని ఉద్యోగులంతా కలిసి మరో 4 కోట్లను అందజేశారు.

Billionaire Gautam Adani commits to support fight against coronavirus
కరోనాపై పోరుకు అదాని గ్సూప్స్​ రూ.100 కోట్ల విరాళం

కరోనాపై పోరుకు ప్రముఖ బిలియనీర్​​ గౌతమ్​ అదాని ముందుకొచ్చారు. తమ సంస్థ నుంచి పీఎం కేర్స్​ ఫండ్​కు రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలోని ఉద్యోగులంతా కలిసి మరో రూ.4 కోట్లను అందజేశారు. ఈ మేరకు కరోనాపై భారత్​ చేస్తున్న పోరాటానికి అదాని గ్రూప్​ తమ వంతు స్వేదాన్ని చిందిస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చర్యలతో లాక్​డౌన్​ విధించినప్పటికీ.. మహమ్మారి ఎంతో మంది ప్రాణాల్ని బలిగొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు అదాని.

కొన్ని దశాబ్దాల తర్వాత మన పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే.. ఈ దేశ పౌరులుగా ఉన్నందుకు వారు గర్వించాలి. భారతీయులంతా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వంతో ఐక్యంగా నిలబడ్డారని తెలుసుకోవాలి.

గౌతమ్​ అదాని, అదాని గ్రూప్​ ఛైర్మన్​

లాక్​డౌన్​ కారణంగా ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతం శ్రమిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు అదాని. ఈ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని.. వారికి తమ వంతు సాయం అందించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు గుజరాత్​ సీఎం రిలీఫ్​ ఫండ్​కు అదాని ఫౌండేషన్​ రూ.5 కోట్లను అందజేసింది. మహారాష్ట్రకూ కోటి రూపాయల విరాళం ప్రకటించారు అదాని. వీటితో పాటు అహ్మదాబాద్​లోని మునిసిపల్​ కార్పొరేషన్​ ఆసుపత్రిలో 100 వెంటిలేటర్లు, ఎన్​-95 మాస్కుల సదుపాయాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.