ప్రస్తుత ఆర్థిక సంవత్సర.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వాహన రంగం వాటా 7 శాతానికి తగ్గే అవకాశాలున్నాయని ఓ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇది 7.5 శాతంగా ఉండటం గమనార్హం.
వాహన రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కారణంగా.. తయారీదారుల ఆదాయం 6 శాతానికే పరిమితం కావొచ్చని అక్యూట్ రేటింగ్ అండ్ రీసర్చ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారం .. వాణిజ్య, ప్యాసింజర్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అన్ని కేటగిరీల్లో వాహనాల అమ్మకాలు 6-7 శాతం మేర తగ్గే అవకాముంది. 2018-19లో.. అన్ని కేటగిరీల్లో 25 మిలియన్ యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం.
ఆదాయం కూడా 2018-19లో గడించిన రూ.3-3.2 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5-6 శాతం తగ్గొచ్చని సర్వే అంచనా వేసింది.
పండుగ సీజన్లోనూ కోలుకోని పరిశ్రమ..
2026 నాటికి దేశ జీడీపీలో వాహనరంగం వాటా 12 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇదే సమయంలో ఆటోమొబైల్ పరిశ్రమ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఏ దశలోనూ కోలుకోలేదు. పండుగ సీజన్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదని నివేదిక అభిప్రాయపడింది. పండుగ సీజన్లో అధిక ఆఫర్లు ప్రకటించినప్పటికీ.. ప్రధాన వాహన తయారీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోలేకపోయాయని పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు భారీగా తగ్గడం.. ఆటోమొబైల్ పరిశ్రమ మందగమనానికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి: వరుస లాభాలు చూసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా?