యాపిల్ నుంచి సరికొత్త మ్యాక్‌బుక్- ధరెంతో తెలుసా? - సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో
అధునాతన హంగులు కల్పిస్తూ మ్యాక్‌బుక్ ప్రో (13- అంగుళాలు)ను ఆవిష్కరించింది ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్. మ్యాజిక్ కీబోర్డుతో పాటు రెట్టింపు స్టోరేజీ, వేగవంతమైన గ్రాఫిక్స్‌తో రానుంది ఈ మ్యాక్‌బుక్. భారత్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టబోయే ఈ యాపిల్ నోట్‌బుక్ ధర, ఇతర విశేషాలు మీకోసం..
గ్యాడ్జెట్ దిగ్గజం యాపిల్ తన 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో సరికొత్త మార్పులు చేసింది. ఇందులో రెటీనా తెర, ఎస్కేప్ కీ, టచ్ బార్, టచ్ ఐడీ, డబుల్ స్టోరేజీ, మ్యాజిక్ కీబోర్డు వంటి అనేక ఫీచర్లను అందిస్తోంది.
ఈ మ్యాక్‌బుక్ శ్రేణిలోనూ అధునాతమైన 10వ తరం ప్రాసెసర్లనే ఉపయోగించింది యాపిల్. ఇందులో 4.1 గిగా హెట్జ్ టర్బో బూస్ట్ స్పీడ్ ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్లను వాడింది. 80 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్‌తో పాటు 3733 మెగా హెట్జ్ సామర్థ్యం కలిగిన 16జీబీ స్టోరేజీని అందిస్తోంది. వినియోగదారులు 32 జీబీ స్టోరేజీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
మ్యాజిక్ కీబోర్డు..
వినియోగదారులకు మంచి టైపింగ్ అనుభవం కల్పించేందుకు మ్యాజిక్ కీబోర్డును తీసుకొచ్చామని మ్యాక్, ఐప్యాడ్ ఉత్పత్తుల మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ టామ్ బోజర్ తెలిపారు.
సిజర్ మెకానిజంతో తయారైన ఈ 1 మి.మీ కీతో వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది.
ఆరో కీల కోసం కొత్త ఇన్వర్టెట్ 'టి' అమరికను అందించారు. దీనివల్ల ఈ కీలను తొందరగా గుర్తించవచ్చు. స్ప్రెడ్‌షీట్‌ను నావిగేట్ చేస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు సులభంగా ఉంటుంది.
డబుల్ స్టోరేజీ..
ఈ మ్యాక్‌బుక్‌లో స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేశారు. ప్రారంభంలో 250జీబీ నుంచి 1టీబీ స్టోరేజీ సదుపాయం కల్పించగా.. ప్రస్తుతం దానికి 4టీబీ ఎస్ఎస్డీకి అప్‌గ్రేడ్ చేశారు.
భారత్‌లో దీని ప్రారంభ రూ.1,22,990 గా నిర్ణయించింది. త్వరలోనే దేశంలోని యాపిల్ అధికారిక స్టోర్లలో ఇవి లభించనున్నాయి.