డిజిటల్ మ్యూజిక్‌లో సంచలనం 'ఐట్యూన్స్'.. ఇక యాపిల్ పరికరాల్లో కనుమరుగు కానుంది. దీని స్థానంలో మరో మూడు కొత్త యాప్‌లను తీసుకురానుందీ టెక్ దిగ్గజం. డిజిటల్ మ్యూజిక్, సినిమాలు(యాపిల్ టీవీ), పాడ్‌కాస్ట్‌లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
"ఐట్యూన్స్ ఇక ఒకే యాప్‌గా ఉండదు. మూడుగా విభజిస్తున్నాం. అవి యాపిల్ మ్యూజిక్, యాపిల్ పాడ్క్యాస్ట్స్, యాపిల్ టీవీ. ఈ ఏడాది చివరికల్లా యాపిల్ టీవీ యాప్‌ను విడుదల చేస్తాం. లాగిన్ కోసం 'సైన్ ఇన్ విత్ యాపిల్'ను ప్రవేశపెట్టబోతున్నాం. ఫేస్బుక్, గూగుల్ ఖాతాల సాయం లేకుండానే సభ్యత్వం లభిస్తుంది. అంతేకాకుండా మీ ఖాతాలకు పూర్తి భద్రత ఉంటుంది."
- క్రేగ్ ఫెడరిజీ, యాపిల్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు
యాపిల్‌లో ఐట్యూన్స్ సేవలు 2001లో ప్రారంభమయ్యాయి. మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది ఐట్యూన్స్. ఐఫోన్, ఐపాడ్లలో మ్యూజిక్, వీడియోలు, క్లౌడ్ స్టోరేజీ తదితర సేవలను అందిస్తోంది.
ఇదీ చూడండి: భారత్‌కు 'నోకియా 6.2' వచ్చేస్తోంది!