ETV Bharat / business

ఛార్జర్​ లేదని యాపిల్​కు రూ.15 కోట్లు ఫైన్​! - ఛార్జర్​ ఇవ్వనందుకు యాపిల్​కు ఫైన్​

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్​కు బ్రెజిల్​ వినియోగదారుల ఫోరం (ప్రోకాన్‌-ఎస్పీ) భారీ జరిమానా విధించింది. ఐఫోన్​ 12 మోడళ్లకు బాక్సులో ఛార్జర్లు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ.. రూ.15 కోట్లు ఫైన్​ వేసింది. పర్యావరణ హితం పేరుతో ఐఫోన్​ 12 మోడళ్లను ఛార్జర్లు, హెడ్​​ఫోన్​లు లేకుండా విక్రయిస్తోంది యాపిల్​. కొత్తగా తీసుకొచ్చే ఐఫోన్ మోడళ్లలో ఎందులోనూ ఇకపై ఛార్జర్లు ఉండవని కూడా ఇదివరకే స్పష్టం చేసింది.

apple Fined by Brazil
యాపిల్​కు బ్రెజిల్​ భారీ ఫైన్​
author img

By

Published : Mar 22, 2021, 10:25 AM IST

యాపిల్ మొబైల్‌ కంపెనీకి బ్రెజిల్‌లో భారీ షాక్‌ తగిలింది. ఛార్జర్‌ లేకుండా ఐఫోన్ 12 మోడళ్లను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్‌-ఎస్పీ) సుమారు ₹15 కోట్లు (2 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్‌ లేని మొబైళ్లను విక్రయించినందుకుగానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది.

ధర ఎందుకు తగ్గించలేదు?

పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 సిరీస్‌ మొబైళ్లకు పవర్‌ అడాప్టర్‌, హెడ్‌ఫోన్‌లు లేకుండా కేవలం ఛార్జింగ్ కేబుల్‌ మాత్రమే ఇస్తున్నట్లు యాపిల్‌ అక్టోబర్‌లో ప్రకటించింది. ఐఫోన్‌ 12 మినీ ధర యూఎస్‌లో 729 డాలర్లు ఉంది. బ్రెజిల్‌లో దీనిని 1200 డాలర్లకు విక్రయిస్తోంది. అయితే ఫోన్‌కు ఛార్జర్‌, హెడ్‌సెట్‌ ఇవ్వకపోవడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని బ్రెజిల్‌ వినియోగదారుల ఫోరం పేర్కొంది. ఛార్జర్‌ ఇవ్వకుండా ఫోన్‌ విక్రయించడం సమంజసం కాదంటూనే, ధర ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించింది. దీనిపై యాపిల్ ఇంకా‌ స్పందించలేదు.

యాపిల్ ఆ విషయం అర్థం చేసుకోవాలి..

'చట్టాలు, నియమాలకు లోబడి కంపెనీలు పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి. దేశంలో వినియోగదారుల చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయనే విషయం యాపిల్ అర్థం చేసుకోవాలి' అని ప్రోకాన్‌ ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఫెర్నాండో కాపెజ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే, వినియోగదారులు ఎక్కువగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారని, ఫోన్‌లకు ఛార్జర్‌ ఇవ్వడం వృథా అనిపిస్తోందని యాపిల్ వీపీ లీసా జాక్సన్ గతంలో‌ అభిప్రాయపడ్డారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:త్వరలో ట్విట్టర్​లో 'అన్​డూ' ఫీచర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.