ETV Bharat / business

ఆండ్రాయిడ్‌ 11.. త్వరలో మీ ముందుకు! - technology android os

ఆండ్రాయిడ్ ఓఎస్​ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారి త్వరలో మీ ముందుకు రానుంది. ప్రస్తుతం నడుస్తున్న పదో వెర్షన్​ నుంచి పదకొండుకు మారేందుకు సిద్ధమవుతోంది. స్క్రీన్ రికార్డింగ్, ఛాట్, నోటిఫికేషన్లపై స్పందించేందుకు సులభమైన విధానం ఈ ఆండ్రాయిడ్​ 11 లో ఉండనున్నాయి.

android
ఆండ్రాయిడ్‌ 11.. త్వరలో మీ ముందుకు!
author img

By

Published : Mar 4, 2020, 9:33 AM IST

ఓఎస్‌ ఏదైనా వెర్షన్‌ మారిందంటే అదో మైలురాయే.. కొత్త సదుపాయాల్ని మోసుకొచ్చి యూజర్ల మనసు దోచుకుంటుంది.. ఆండ్రాయిడ్‌ ఇప్పుడు అదే చేస్తోంది.. పదో వెర్షన్‌ నుంచి పదకొండుకి మారేందుకు సిద్ధం అవుతోంది.. డెవలపర్‌ వెర్షన్‌తో పిక్సల్‌ ఫోన్‌ యూజర్లను పలకరించేసింది కూడా.. కొత్త ఆప్షన్లు ఏం మోసుకొచ్చాయో తెలుసుకుందామా?

స్క్రీన్‌ రికార్డింగ్‌తో ఇకపై ఫోన్‌లోనే వీడియో ట్యుటోరియల్స్‌ చేయడం సులభం అవుతుంది. కేవలం వీడియోని రికార్డు చేయడం కాదు. వాయిస్‌ రికార్డింగ్‌ని కూడా జోడించొచ్ఛు

స్క్రోలింగ్‌ స్క్రీన్‌షాట్‌లు వస్తున్నాయ్‌. అంటే.. కేవలం తెరపైన ఉన్నవే కాకుండా తెరని పైకీ, కిందికీ స్క్రోల్‌ చేస్తూ స్క్రీన్‌షాట్‌లు తీసుకోవచ్ఛు

లొకేషన్‌ యాక్సెస్‌ని నియంత్రించొచ్ఛు నిత్యం ఎనేబుల్‌లో ఉంచకుండా అవసరం అయినప్పుడు మాత్రమే యాప్‌లు లొకేషన్‌ని ట్రాక్‌ చేసేలా అనుమతి ఇవ్వడం అన్నమాట. అంటే.. ఏదైనా యాప్‌కి ఒక్కసారి మాత్రమే లొకేషన్‌ యాక్సెస్‌ అనుమతి ఇవ్వొచ్ఛు

స్క్రీన్‌ రికార్డింగ్‌ చేయొచ్చు

ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న స్క్రీన్‌ రికార్డింగ్‌ సౌకర్యాన్ని పదకొండు తెస్తోంది. దీంతో ఇకపై ఫోన్‌లోనే వీడియో ట్యుటోరియల్స్‌ చేయడం సులభం అవుతుంది. కేవలం వీడియోని రికార్డు చేయడం కాదు. వాయిస్‌ కూడా జోడించొచ్ఛు అందుకు కావాల్సిన ఆప్షన్స్‌ని నోటిఫికేషన్స్‌ ప్యానల్‌లోనే పొందుపరిచారు. ఒక్కసారి ట్యాప్‌ చేసి స్క్రీన్‌ రికార్డింగ్‌ని మొదలెట్టొచ్ఛు ఇకపై థర్డ్‌ పార్టీ యాప్‌లతో పని లేదు.

తెరపైకి ‘బబుల్స్‌’

ఎవరైనా టెక్స్ట్‌ మెసేజ్‌ చేస్తే తెరపై నోటిఫికేషన్‌ వస్తుంది. మెసేజ్‌ ఐకాన్‌ని ట్యాప్‌ చేసి చూస్తాం. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఎవరైనా మెసేజ్‌ పంపితే తెరపైకి ఛాట్‌ బబుల్‌ (ఛాట్‌ హెడ్‌) వస్తుంది. ఎలాగంటే.. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ మాదిరిగా అన్నమాట. ఎవరైనా ఛాట్‌ మెసేజ్‌ పంపితే బబుల్‌ ఐకాన్‌ ఎలా వస్తుందో అచ్చంగా అలానే టెక్స్ట్‌ మేసేజ్‌లు కూడా కనిపిస్తాయ్‌. బబుల్‌ని సెలెక్ట్‌ చేసి మెసేజ్‌లు చూడొచ్ఛు స్పందించొచ్ఛు దీని కోసం ముందే మెసేజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బబుల్స్‌ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

నోటిఫికేషన్‌ నుంచే స్పందన

ఫోన్‌కి ఏమేం నోటిఫికేషన్స్‌ వచ్చాయో చూసేందుకు తెరని కిందికి లాగుతాం. అన్ని అలర్ట్‌లను చూస్తాం. వాటికి స్పందించాలంటే.. వాటిని సెలెక్ట్‌ చేసి సంబంధిత మెసెంజర్‌ యాప్‌లోకి వెళ్లాల్సిందే. ఇకపై అంత శ్రమ లేకుండా నోటిఫికేషన్‌ విభాగంలోనే మెసేజ్‌ని చదివి అక్కడ నుంచే రిప్లై ఇవ్వొచ్ఛు ఏదైనా మేటర్‌ని కాపీ, పేస్ట్‌ చేయొచ్ఛు అంటే.. మెసేజ్‌ల ద్వారా చేసే కమ్యూనికేషన్‌ని మరింత సులభతరం చేస్తోంది అన్నమాట. దీన్నో 'conversation' సెక్షన్‌గా పిలుస్తున్నారు. ఎమోజీలు, ఫొటోలు కూడా అక్కడే ఎటాచ్‌ చేసి పంపొచ్ఛు

మరికొన్ని..

ఫోన్‌ని ఫ్లైట్‌ మోడ్‌లో పెడితే అన్ని నెట్‌వర్క్‌లు డిజేబుల్‌ అవ్వడం తెలుసు. కానీ, వచ్చే వెర్షన్‌లో ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టినా బ్లూటూత్‌ ఎనేబుల్‌లోనే ఉంటుంది. దీంతో విమానంలో వెళ్తున్నప్పుడు ‘ఏరోప్లేన్‌’ మోడ్‌లో పెట్టినా కూడా వైర్‌లెస్‌ హెడ్‌సెట్‌లతో ఫోన్‌లో పాటలు వినొచ్ఛు.

Motion Sense gesture. దీంతో ఫోన్‌ కెమెరా ముందు చేతుల్ని కదుపుతూనే కమాండ్స్‌ని రన్‌ చేయొచ్ఛు ఉదాహరణకు ప్లే అవుతున్న మ్యూజిక్‌ని పాజ్‌ చేయాలంటే ఫోన్‌ కెమెరాకి చేతులతో సైగ చేస్తే చాలు.

‘పర్మిషన్స్‌’ పదిలం..

వాడుకోవచ్చు అని ఏ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసినా అన్ని అనుమతులు కోరుతూ తికమక పెట్టేస్తున్నాయ్‌. మన ప్రైవసీపై మనకే అనుమానం వస్తున్న పరిస్థితి. దీనికి కాస్త ఊరట కలిగేలా యాప్‌ పర్మిషన్స్‌ని కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక సెట్టింగ్స్‌ని అందిస్తోంది. వాటితో యాప్‌ల అనుమతిని నిర్దేశించొచ్ఛు ఒక్కసారి మాత్రమే యాక్సెస్‌ ఇవ్వడం.. లేదంటే యాప్‌ని వాడుతున్నప్పుడు మాత్రమే పర్మిషన్స్‌ ఎనేబుల్‌ అవ్వడం చేయొచ్ఛు యాప్‌ని క్లోజ్‌ చేశాక అనుమతులు అన్నీ డిజేబుల్‌ అయిపోతాయి. దీంతో యాప్‌లు నిత్యం కెమెరా, మైక్రోఫోన్‌, లొకేషన్‌.. ట్రాక్‌ చేస్తున్నాయేమో అని భయపడాల్సిన పని లేదు.

డార్క్‌ థీమ్‌ ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అంటే.. రాత్రి ఏడు తర్వాత ఎక్కువ లైటింగ్‌తో కళ్లకి ఒత్తిడి కలగకుండా డార్క్‌మోడ్‌ని నిర్ణీత సమయానికి ఎనేబుల్‌ అయ్యేలా చేయొచ్ఛు.

ఇదీ చూడండి: తాలిబన్​ ఒప్పందం.. భారత్​ భద్రతకు చేటు తెచ్చేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.