ETV Bharat / business

జాబ్​ మానేస్తే భారీ బోనస్- అమెజాన్ వింత ఆఫర్​! - అమెజాన్​ పే టూ క్విట్​ అంతరార్థం

ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​.. పని చేస్తున్న ఉద్యోగులకే కాదు, సంస్థలో జాబ్​ మానేయాలనుకున్న వారికీ(Amazon offers to Employees) భారీ ప్యాకేజీ (Pay to Quit offer) ఇస్తుంది. ఉద్యోగం మానేసే వారికి ప్యాకేజీ ఏమిటి? అనుకుంటున్నారా? మరి కంపెనీ అలా ఎందుకు చేస్తుందో, దాని వెనకున్న అంతరార్థం ఏమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Amazon offer huge package for Quit Employees
ఉద్యోగం మానేస్తే భారీ ప్యాకేజ్​
author img

By

Published : Aug 22, 2021, 5:41 PM IST

అమెజాన్​.. ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటి. ఈ-కామర్స్​ వ్యాపారాల్లో ప్రపంచంలోనే అగ్రగామి. కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos)​ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇలా.. చెప్పుకుంటూ పోతే అనేక రికార్డులు.. దీని సొంతం.

ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అందుకు తగ్గట్లుగానే అమెజాన్ ఉద్యోగ అవకాశాలు, భారీ వేతానాలు ఇస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. కంపెనీలో ఉద్యోగం మానేయాలి అనుకునే వారికి కూడా భారీ ప్యాకేజీ ఇస్తోంది అమెజాన్​. అదేంటి.. ఉద్యోగం మానేస్తానంటే డబ్బులిస్తుందా అని ఆశ్యర్యపోతున్నారా? అయితే కంపెనీ అలా ఎందుకు చేస్తుంది (What is Amazon pay to Quit offer)? ఉద్యోగం మానేసే వారికి ఎంత ప్యాకేజీ ఇస్తుంది (Amazon pay to Quit package)? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఇక పని చేయలేమనుకుంటే..

కంపెనీలో పని నచ్చకపోయినా.. ఇంకా ఇక్కడ పని చేయాలేమని నిర్ణయించుకున్నా.. వారు కంపెనీని వీడేందుకు 5 వేల డాలర్ల (రూ.3.7 లక్షల పైమాటే) వరకు ప్యాకేజీ ఇస్తోంది అమెజాన్​. 'పే టూ క్విట్​' పేరుతో ఈ ఆఫర్​ ఇచ్చేందుకు అమెజాన్ చెప్పే కారణమేంటంటే(reason for Amazon pay to Quit offer).. ఇష్టం లేకుండా పని చేయడం ఉద్యోగితో పాటు కంపెనీకీ అంత మంచిది కాదు అని.

అయితే ఈ ఆఫర్ ఏడాది పొడవునా ఉండదు. ఏడాదిలో ఒకసారి మాత్రమే ప్రకటిస్తుంటుంది అమెజాన్​. ఉద్యోగంలో చేరి కనీసం సంవత్సరం పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే (Eligibility for Amazon pay to Quit offer) ఈ ఆఫర్​ వర్తిస్తుంది.

అఫరే కాదు.. వద్దనీ సలహా..

ఈ ఆఫర్​ తీసుకునే ఉద్యోగులకు.. మరోసారి ఆలోచించుకోమని సలహా కూడా ఇస్తుంది అమెజాన్​. ఆఫర్​ మెమోపై కూడా 'Please don't take this offer' అని నోట్​ ఉంటుంది. ఈ ఆఫర్​తో ఉద్యోగం వదిలేయకండి.. అని కంపెనీ సలహా ఇచ్చేందుకు కారణం లేకపోలేదు. ఒక సారి ఈ ఆఫర్​ను వినియోగించుకుంటే.. భవిష్యత్​లో మళ్లీ అమెజాన్​లో ఆ వ్యక్తి ఉద్యోగం చేయడం కుదరదు.

ఇది అమెజాన్ సొంత కాన్సెప్ట్ కాదు..

'పే టూ క్విట్​' కాన్సెప్ట్ నిజానికి అమెజాన్ సొంతం కాదు. ఆన్​లైన్ షూ రిటైలర్​ 'జాప్పస్'​.. ఇలాంటి కాన్సెప్ట్​ను పరిచయం చేసింది. కొత్తగా చేరిన ఉద్యోగులు కంపెనీ నచ్చక వీడదామనుకుంటే.. అలాంటి వారికి వెయ్యి డాలర్లు చెల్లించేది ఆ కంపెనీ. 2009లో జాప్పస్​ను అమెజాన్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్​లో పలు మార్పులు చేసి.. తమ ఉద్యోగులకు వర్తింపజేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.