మరోసారి భారీ ఆఫర్లకు సిద్ధమయ్యాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు. దీపావళిని పురస్కరించుకుని ‘'గ్రేట్ ఇండియన్ సేల్'’తో అమెజాన్.. 'బిగ్ దివాళీ సేల్'’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగను తీసుకొచ్చాయి.
13 నుంచి అమెజాన్ ‘గ్రేట్..’
స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్, కెమెరాలు, టీవీ, ఇతర గ్యాడ్జెట్లపై ఆఫర్లను అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ద్వారా మరోసారి అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ నడుస్తుంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అక్టోబర్ 12 మధ్యాహ్నం నుంచే ఈ ఆఫర్లు పొందొచ్చు. ఆఫర్ల సమయంలో ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు స్క్రీన్ రీప్లేస్‌మెంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఈ సేల్‌లో అమెజాన్ అందిస్తోంది.
ముఖ్యంగా యాపిల్, షియోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, ఆనర్ వంటి బ్రాండ్ల ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి. వన్‌ప్లస్ 7టీ ప్రో ఫోన్‌ను తొలిసారిగా సేల్‌కు తీసుకురానున్నారు. కేవలం మొబైల్ ఫోన్లే కాక టీవీలు, ఇతర గ్యాడ్జెట్లపైనా లభించనున్నాయి. ఏ ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఫ్లిప్‌కార్ట్ నేటి నుంచే..
‘బిగ్ బిలియన్ డేస్’ తరహాలో ప్లిప్‌కార్ట్ మరోసారి ‘బిగ్ దివాళీ సేల్’కు సిద్ధమైంది. నేటి నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్‌తో కూడిన మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్లు, బైబ్యాక్ గ్యారెంటీ ప్లాన్లు ఈ సేల్‌లో లభించనున్నాయి. ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ 7ఎస్, రియల్‌మీ 5, వివో జెడ్1 ప్రో, రియల్‌మీ సీ2 మొబైల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేస్తోంది. కేవలం మొబైల్స్‌పైనే కాక టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్‌వాచీలపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి.
ఇదీ చూడండి: సరికొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ 7టీ సిరీస్‌లో స్మార్ట్ఫోన్లు