ETV Bharat / business

ఏజీఆర్​ బకాయిల చెల్లింపునకు టెల్కోలు సిద్ధం! - ఏజీఆర్​ వివాదం వార్తలు

సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఏజీఆర్​ బకాయిల చెల్లింపునకు కసరత్తు ముమ్మరం చేశాయి టెలికాం సంస్థలు. ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా, టాటా టెలిసర్వీసెస్​ వంటి సంస్థలు బకాయిల్లో కొంత మొత్తాన్ని రేపు (సోమవారం) చెల్లించేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Airtel, Voda Idea, Tata Tele likely to pay AGR dues on Monday
ఏజీఆర్​ బకాయిల చెల్లింపునకు టెల్కోలు సిద్ధం!
author img

By

Published : Feb 16, 2020, 7:52 PM IST

Updated : Mar 1, 2020, 1:26 PM IST

దేశీయ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా, టాటా టెలిసర్వీసెస్​లు సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) బకాయిల చెల్లింపునకు సిద్ధమయ్యాయి. ఈ మూడు సంస్థలు సోమవారం నాడు బకాయిలు చెల్లించాలని భావిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

ఇటీవలి లెక్కల ప్రకారం ఈ మూడు సంస్థల ఏజీఆర్​ బకాయి మొత్తం రూ.లక్ష కోట్లుగా ఉంది. అయితే అందులో కొంత మొత్తం మాత్రమే ప్రస్తుతానికి చెల్లించనున్నట్లు సమాచారం.

కోర్టు ఆగ్రహంతో కసరత్తు ముమ్మరం..

ఏజీఆర్ బాకాయిలు చెల్లించాల్సిందేనని.. ఎలాంటి గడువు పెంచే యోచన లేదని సుప్రీంకోర్టు గత వారం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికాం సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఫిబ్రవరి 20న రూ.10,000 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తామని ఎయిర్​టెల్​ తెలిపింది. అయితే బకాయిల చెల్లింపునకు టెల్కోలకు ఎలాంటి గడువు పెంచే యోచన లేదని టెలికాం శాఖ (డీఓటీ) స్పష్టం చేసిన విషయం విదితమే.

చర్యలకు సిద్ధమైన డీఓటీ..

ఏజీఆర్​ బకాయిలు చెల్లించేందుకు టెలికాం సంస్థలకు గత శుక్రవారం అర్ధరాత్రి వరకే గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ సమయానికి బకాయిలు చెల్లించని టెల్కోలపై చర్యలకు సిద్ధమైంది డీఓటీ. శని, ఆది వారాలు సెలవు దినాలు అయినందున సోమవారం నుంచి ఆయా సంస్థలకు నోటీసులు పంపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు డీఓటీ ఇటీవల స్పష్టం చేసింది.

ఏజీఆర్ వివాదంపై మరింత సమాచారం:

టెల్కోలపై చర్యలకు సిద్ధమైన టెలికాం శాఖ

'ఏజీఆర్​ బకాయిలు చెల్లిస్తాం.. కాకపోతే..'

సుప్రీం తలంటు - డీఓటీ ఉత్తర్వు ఉపసంహరణ

Last Updated : Mar 1, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.