ETV Bharat / business

వారం రోజుల్లో 10వేల కోట్లు చెల్లిస్తాం: ఎయిర్​టెల్​ - ఎయిర్​టెల్​

సుప్రీం కోర్టు ఆగ్రహం, టెలికాం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో భారతి ఎయిర్​టెల్​ ఏజీఆర్​ బకాయిల చెల్లింపుపై స్పష్టతనిచ్చింది. ఈ నెల 20లోపు రూ.10వేల కోట్లు జమ చేస్తామని.. మిగిలిన మొత్తాన్ని కోర్టు తదుపరి విచారణకు ముందే చెల్లిస్తామని తెలిపింది.

AIRTEL
ఎయిర్​టెల్​
author img

By

Published : Feb 14, 2020, 7:42 PM IST

Updated : Mar 1, 2020, 8:47 AM IST

ఏజీఆర్​ బకాయిల చెల్లింపుపై భారతి ఎయిర్​టెల్​ స్పందించింది. ఈ నెల 20లోపు రూ.10వేల కోట్లు చెల్లిస్తామని టెలికాం శాఖకు తెలిపింది. టెలికాం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చింది ఎయిర్​టెల్​.

"ఈ రోజు సుప్రీంకోర్టు నిర్దేశం ప్రకారం 2020 ఫిబ్రవరి 20లోపు రూ.10వేల కోట్లు డిపాజిట్ చేస్తాం. మిగిలిన బకాయిలు సుప్రీం కోర్టు తదుపరి విచారణ కన్నా ముందే చెల్లిస్తాం."

-భారతి ఎయిర్​టెల్​

సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏజీఆర్​ బకాయిల ఈ రోజే చెల్లించాలని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్​టెల్​ ఈ మేరకు స్పందించింది.

ఏజీఆర్​ కింద టెలికాం శాఖకు ఎయిర్​టెల్​ రూ.35,586 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎయిర్​టెల్​తోపాటు వొడాఫోన్​-ఐడియా, టాటా టెలీసర్వీసెస్​ తదితర టెల్కోలు కలిసి మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయి ఉన్నాయి. 2020 జనవరి 23లోపు ఈ బకాయిలు చెల్లించాలని గతేడాది అక్టోబర్​ 24న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Last Updated : Mar 1, 2020, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.