ETV Bharat / business

ఉద్యోగులకు కరోనా దెబ్బ- జీతాలు తగ్గిస్తున్న సంస్థలు - ఇండిగో వేతనాలు తగ్గింపు

ప్రపంచాన్ని ముప్పుతిప్పులు పెడుతున్న కరోనా ప్రభావం ఇప్పుడు అన్ని రంగాల ఉద్యోగులపై పడనుంది. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని భారీ నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఉద్యోగుల వేతనాలు తగ్గించాలని భావిస్తున్నాయి ఎయిర్ఇండియా, ఇండిగో సంస్థలు. మరిన్ని సంస్థలు ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

salaries cut due to corona
వేతనాల కోతలు సిద్ధమైన ఎయిర్​ఇండియా
author img

By

Published : Mar 19, 2020, 3:34 PM IST

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం బెంబేలెత్తుతోంది. కొవిడ్-19 కారణంగా కొన్ని రోజులుగా వ్యాపార, వాణిజ్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దాదాపు అన్ని రంగాల్లోని సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో భారత్​లోని పలు సంస్థలు నష్టాలను తగ్గించుకునేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల వేతనాల కోతకు సిద్ధమయ్యాయి.

ఎయిర్ ఇండియా 5 శాతం కట్​!

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా ఉద్యోగులకు 5 శాతం మేర వేతనాలు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఎయిర్​ఇండియా అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కారణంగానే ఉద్యోగుల జీతాలు 5 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇండిగో సీఈఓ వేతనం 25 శాతం కోత..

ప్రైవేటు విమానయాన దిగ్గజం ఇండిగో కూడా వేతనాల తగ్గింపునకు సిద్ధమైంది. సీనియర్ ఉద్యోగులకు వేతనల కోతపై ఇప్పటికే సమాచారం అందించింది ఈ సంస్థ.

'ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం భారీగా తగ్గింది. విమానయాన సంస్థల మనుగడ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో బ్యాండ్ ఎ, బి ఉద్యోగులను మినహాయించి మిగతా వారందరికీ వేతనాలు తగ్గించాలని నిర్ణయించాం.' అని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్​లో సంస్థ సీఈఓ రొనోజోయ్​ దత్​ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి వేతనాల తగ్గింపు అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు.

ఇదే సమయం నుంచి తాను స్వయంగా 25 శాతం వేతనాన్ని తగ్గించుకుంటున్నట్లు సీఈఓ రొనోజోయ్​ దత్​ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగులకు మాత్రం వేతనాల్లో ఎంత మేర కోత విధించనున్నారు అనే విషయం వెల్లడించలేదు.

'కరోనా నేపథ్యంలో విమానయాన సంస్థల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తమ సరిహద్దులను తాత్కాలికంగా మూసేశాయి. ఫలితంగా ఆదాయం భారీగా తగ్గింది. ఈ కారణంగా రానున్న రోజుల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.' అని ఇండిగో విమాన సేవల ముఖ్యాధికారి ఆశిం మిశ్రా సంస్థ పైలట్లకు ఈ మెయిల్​లో తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వేతనాల తగ్గింపుపై సంస్థ ప్రకటన చేయడం గమనార్హం.

ఇదీ చూడండి:వృథా ఖర్చు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.