ETV Bharat / business

వినూత్న విమాన ప్రయాణం.. ఎక్కిన చోటే దిగాలి! - ఫ్లైట్‌ టు నోవేర్ సేవలు

కరోనా కాలంలో ఇంట్లోనే ఉండి బోర్​ కొట్టిందా..? ప్రయాణాలు చేసి, ఆహ్లాదకరమైన ప్రాంతాలను చూసి చాలా రోజులైందా..? అయితే మీకు కాస్త ఆనందాన్ని ఇచ్చేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది ఎయిర్​ఇండియా. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ప్రారంభమైన 'ఫ్లైట్‌ టు నోవేర్‌' తరహా సేవలను భారత్​లోనూ ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.

nowhere to go flight services
వినూత్న విమాన ప్రయాణం.. ఎక్కిన చోటే దిగాలి!
author img

By

Published : Sep 25, 2020, 9:55 PM IST

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా విమాన ప్రయాణాలను మిస్‌ అవుతున్న ప్రయాణికుల కోసం.. ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌ వినూత్న సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఫ్లైట్‌ టు నోవేర్‌' పేరుతో నడిపే ఈ విమానంలో సిడ్నీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని, ఏడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టి.. మళ్లీ సిడ్నీ విమానాశ్రయంలోనే దింపేస్తారట. ప్రయాణికులకు ఈ ఏడు గంటల్లో ప్రముఖ సందర్శక ప్రాంతాలైన క్వీన్స్‌లాండ్‌, న్యూ సౌత్‌ వేల్స్‌, గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌, ఊలూరు, సిడ్నీ హార్బర్‌ తదితర ప్రాంతాలను విమానంలోనుంచే చూపిస్తారట.

అక్టోబర్‌ 10న ఈ ప్రయాణం ఉండగా.. దీనికి సంబంధించిన టికెట్లను ఇటీవల క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌ ఆన్‌లైన్‌లో పెట్టగా పది నిమిషాల్లో అమ్ముడుపోవడం విశేషం. ఇప్పుడు ఇలాంటి సేవలనే మన దేశంలో ప్రారంభించేందుకు ఎయిర్‌ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మిస్​ అవుతున్న వారికోసం...

భారత్‌లోనూ విమాన ప్రయాణాలను మిస్‌ అవుతున్న వారి కోసం ఎయిర్‌ఇండియా 'ఫ్లైట్‌ టు నోవేర్‌' పేరుతోనే సేవలను అందుబాటులోకి తీసుకురానుందట. ఒక విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానం.. పలు సందర్శక ప్రాంతాలను గాల్లోనే చుట్టేసి.. తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే ఏయే విమానాశ్రయాల్లో ఈ సేవలు తీసుకొస్తారు? ఏయే సందర్శక ప్రాంతాల మీదుగా తిప్పుతారు? ఎంత సమయం ప్రయాణం ఉంటుందనే వివరాలు ఇంకా తెలియలేదు. ఈ సేవల ప్రారంభించడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ సేవలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భారత్‌లోనే కాదు.. సింగపూర్‌లోనూ ఇలాంటి సేవలు ప్రారంభించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోందట.

ఇదీ చూడండి: సినీ ప్రపంచంలో ఎన్నో మరపురాని విశేషాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.