ETV Bharat / business

అదానీ గ్రూప్​ నుంచి మరో ఐపీఓ.. వచ్చేది ఎప్పుడంటే?

Adani Wilmar IPO: అదానీ గ్రూప్​ నుంచి మరో కంపెనీ పబ్లిక్​ ఇష్యూకు రానుంది. ఫార్చూన్​ బ్రాండ్​పై వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్​ ఐపీఓ ఈ జనవరి 27న ప్రారంభం కానుంది.

Adani Wilmar
Adani Wilmar
author img

By

Published : Jan 21, 2022, 7:34 AM IST

Updated : Jan 21, 2022, 10:19 AM IST

Adani Wilmar IPO: ఫార్చూన్‌ బ్రాండుపై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈనెల 27న ప్రారంభమై 31న ముగుస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఇష్యూలో భాాగంగా రూ.3,600 కోట్ల విలువైన తాజా షేర్లను అదానీ విల్మర్‌ విక్రయిస్తుంది. ఈ నిధుల నుంచి రూ.1,900 కోట్లను మూలధన వ్యయాల కోసం, రూ.1,100 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ.500 కోట్లను వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడుల నిమిత్తం అదానీ విల్మర్‌ వినియోగించనుంది.

అదానీ విల్మర్​ ఇష్యూ ధర రూ. 218- 230 మధ్య ఉండనుంది. పెట్టుబడిదారు.. ఒక లాట్​లో కనీసం​ 65 షేర్లు దక్కించుకునే అవకాశముంది.

రూ.37,195 కోట్ల ఆదాయంతో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల్లో ఒకటిగా అదానీ విల్మర్‌ ఉంది. అదానీ గ్రూపు, సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూపుల సంయుక్త సంస్థే అదానీ విల్మర్‌.

అదానీ గ్రూప్​ నుంచి ఇప్పటికే అదానీ ఎంటర్​ప్రైజెస్​, అదానీ పోర్ట్స్​ అండ్​ సెజ్​, అదానీ గ్రీన్​ ఎనర్జీ, అదానీ ట్రాన్స్​మిషన్​, అదానీ పవర్​, అదానీ టోటల్​ గ్యాస్​ ఇలా మొత్తం ఆరు ఇప్పటికే స్టాక్​ మార్కెట్​ ఎక్స్చేంజీల్లో లిస్ట్​ అయి ఉన్నాయి. ఇప్పుడు అదానీ విల్మర్​ రానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: భారీగా వెనకేసుకున్న అదానీ.. రోజుకు రూ. వెయ్యి కోట్ల సంపాదన

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ

Last Updated : Jan 21, 2022, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.