ETV Bharat / business

భారీగా కుదేలైన అదానీ షేర్లు.. కారణమిదే! - అదానీలో పెట్టుబడులున్న సంస్థల ఖాతాలు సీజ్​

అదానీ గ్రూప్​లో వాటాలున్న.. మూడు విదేశీ పెట్టుబడి సంస్థల ఖాతాలను ఎన్​ఎస్​డీఎల్ నిపివేసిందన్న వార్తలతో సంస్థ షేర్లు భారీగా కుదేలయ్యాయి. దాదాపు గ్రూప్​లోని అన్ని సంస్థల షేర్లు లోవర్​ సర్క్యూట్​ను తాకాయి. ఆ మూడు సంస్థలకు అదానీ గ్రూప్​లో రూ.43 వేల కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.

Adani Group stocks tumble
అదానీ షేర్ల పతనం
author img

By

Published : Jun 14, 2021, 12:22 PM IST

ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. వీటిలో భారీగా పెట్టుబడులు ఉన్న విదేశీ పెట్టుబడి సంస్థల ఖాతాలను ఎన్​ఎస్​డీఎల్​ (నేషనల్​ సెక్యూరిటీస్​ డిపాజిటరీ లిమిటెడ్) నిలుపుదల చేసిందన్న వార్తలు ఇందుకు ప్రధాన కారణం. ఈ వార్తలతో అదానీ ఎంటర్​ప్రైజెస్ షేరు సోమవారం అత్యధికంగా 24.99 శాతం తగ్గింది. దీనితో షేరు ధర రూ.1,201.10కు దిగొచ్చింది.

షేర్ల పతనం ఇలా..

అదానీ పోర్ట్స్​ అండ్ స్పెషల్ ఎకానమిక్​ జోన్ షేరు​ 18.75 శాతం క్షీణించింది. షేరు ధర రూ.681.50కి తగ్గింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్​, అదానీ ట్రాన్స్​ మిషన్​ షేర్లు 5 శాతం చొప్పున పడిపోయాయి. అదానీ పవర్​ 4.99 శాతం క్షీణించింది.

అదానీ గ్రూప్​లోని అన్ని సంస్థల షేర్లు లోవర్ సర్క్యూట్​ను తాకాయి.

ఖాతాల నిలిపివేత ఎందుకు?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అల్బులా ఇన్వెస్ట్​మెంట్ ఫండ్​, క్రెస్ట ఫండ్, ఏపీఎంఎస్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్​ఎస్​డీఎల్​ నిలిపివేసింది. మే 31 ముందే ఇది జరిగింది. ఈ మూడు సంస్థలకు కలిపి అదానీ గ్రూప్​లో రూ.43,500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.

ప్రివెన్షన్​ ఆఫ్​ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్​ఏ) ప్రకారం అవసరమైన సమాచారం ఇవ్వకపోవడమే ఆయా సంస్థల ఖాతాలు నిలిపవేసిందుకు కారణంగా తెలిసింది.

ఇదీ చదవండి:Petrol Price: హైదరాబాద్​లోనూ సెంచరీ దాటిన పెట్రోల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.