ETV Bharat / business

Ola Electric scooter: అరుదైన ఫీచర్‌తో ఓలా స్కూటర్‌ - Ola Electric Scooter booking

ఓలా విద్యుత్తు స్కూటర్​​లోని(Ola Electric scooter) కొన్ని ఫీచర్లను వెల్లడించింది సంస్థ. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్​ మోడ్​ను దీనిలో పొందుపరిచినట్లు తెలిపింది. ఇంకా మరెన్నో సరికొత్త ఫీచర్లతో తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

Ola Electric Scooter
అరుదైన ఫీచర్‌తో ఓలా స్కూటర్‌
author img

By

Published : Aug 7, 2021, 3:33 PM IST

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా విద్యుత్తు స్కూటర్‌లోని(Ola Electric scooter) కొన్ని ఫీచర్లను ఈరోజు సంస్థ వెల్లడించింది. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్‌ మోడ్‌ను దీనిలో పొందుపరిచినట్లు సంస్థ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. 'రెవల్యూషన్‌ టు రివర్స్‌ క్లైమేట్‌ ఛేంజ్‌' అనే క్యాప్షన్‌తో స్కూటర్‌ రివర్స్‌లో వెళుతున్న ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. 'నమ్మశక్యంకాని వేగంతో స్కూటర్‌ను రివర్స్‌ చేయొచ్చు' అని రాసుకొచ్చారు. ద్విచక్రవాహనాల్లో రివర్స్‌ మోడ్‌ చాలా అరుదుగా ఉంటుంది. ఖరీదైన బైక్ అయిన హోండా గోల్డ్‌ వింగ్‌ సహా.. బజాజ్‌ చేతక్‌, ఏథర్‌ 450ఎక్స్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌ వంటి ఈ-స్కూటర్లలో మాత్రమే ఈ ఫీచర్‌ ఉంది.

ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ చేయొచ్చని గతంలో ఓ సందర్భంలో కంపెనీ వెల్లడించింది. ఈ సగం ఛార్జింగ్‌తో 75 కి.మీ వరకు ప్రయాణించొచ్చని తెలిపింది. వీటితో పాటు తాళంచెవి లేకుండా యాప్‌ ద్వారానే స్కూటర్‌ను స్టార్ట్‌ చేసే అత్యాధునిక ఫీచర్‌ను కూడా ఇందులో పొందుపరిచినట్లు సమాచారం.

ప్రస్తుతం స్కూటర్‌ బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. రూ.499 చెల్లించి స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు. మరిన్ని ఫీచర్లను ఆరోజే వెల్లడించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్న ఈ స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేగం, ఛార్జింగ్‌, బూట్‌ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమైనదిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 10 రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ఇదీ చూడండి: ఓలా తొలి ఈ-స్కూటర్ విడుదల ఎప్పుడంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.