భారత్‌లో 88 శాతం కొనుగోళ్లు మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. పేపాల్, ఐపీఎస్‌ఓఎస్‌లు సంయుక్తంగా విడుదల చేసిన "ఎంకామర్స్ రిపోర్ట్"లో ఈ విషయం వెల్లడైంది. ఈ రెండు సంస్థలు 11 దేశాల్లో.. 22 వేల మంది వినియోగదారులు.. 4వేల మంది వ్యాపారస్థులపై ఆధ్యయనం చేశాయి.
భారత్‌లో మొత్తం 2 వేల మంది.. 18-74 వయసున్న వినియోగదారులు, 300 మంది వ్యాపారస్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
వీరిలో మొత్తం.. 88 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే కొనుగోళ్ళు జరుపుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సగటున ఇది 71 శాతంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఈ స్థాయిలో మొబైల్ ఫోన్ల ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు ఇష్టపడుతుండటానికి ప్రధాన కారణం.. తక్కువ సమయంలో పనులు పూర్తవుతుండటమేనని సర్వే పేర్కొంది. యువత ఎక్కువగా ఈ కామర్స్ యాప్‌లను వినయోగిస్తున్నట్లు వెల్లడించింది.
వ్యాపారుల్లో ఇలా..
భారత్‌లో 98 శాతం వ్యాపారస్థులు.. మొబైల్ యాప్‌ల ద్వారా పేమెంట్లను స్వీకరిస్తున్నట్లు సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సగటు 90 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
బిల్లుల చెల్లింపులు, ఫ్యాషన్ యాప్‌లలోనే ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మొబైల్ కామర్స్ వినియోగం భారత్‌లో అధికంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.