సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ అనుబంధ సంస్థ 'వాట్సాప్' భారత్‌లో ఉత్తమ అంకురాలకు ఆర్థిక ప్రోత్సహం అందించే చర్యలు వేగవంతం చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో "స్టార్టప్ ఇండియా-వాట్సాప్ గ్రాండ్ చాలెంజ్" పేరుతో వాట్సాప్ నిర్వహించిన పోటీ ద్వారా ఐదు స్టార్టప్‌లను విజేతలుగా ఎంపిక చేసినట్లు తెలిపింది. విజేతలుగా నిలిచిన అంకురాలకు రూ.35 లక్షల చొప్పున మొత్తం రూ.1.75 కోట్ల ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు పేర్కొంది.
ఈ పోటీకి 25 రాష్ట్రాల నుంచి 1,700 అంకురాలు నమోదు చేసుకోగా 10 సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసి... వాటి నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 5 అంకురాలను విజేతలుగా ఎంపిక చేసినట్లు వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ వెల్లడించారు.
విజేతలుగా నిలిచిన అంకురాలు ఇవే
- మెడ్కార్డ్స్-ఇది ఆరోగ్య సాంకేతికత అందించే అంకురం
- మేల్జో-వర్చువల్ రియాలిటీ అంకురం
- జవీస్-వాట్సాప్ ఆధారిత కృత్రిమ మేధపై పనిచేసే అంకురం
- గ్రామోఫోన్-వ్యవసాయ సాంకేతిక అంకురం
- మినియన్ ల్యాబ్స్- విద్యుత్ వ్యయాలు తగ్గించుకునే సాంకేతికతను అందించే అంకురం