లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ ఖాతాదారులపై పాస్వర్డ్ రక్షణలోని ఓ లోపం ప్రభావం చూపించిందని మాతృసంస్థ ఫేస్బుక్ ప్రకటించింది. నాలుగు వారాల క్రితం ప్రకటించిన సంఖ్య కంటే మరింత ఎక్కువ మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రకటించింది.
సంఖ్యలు, సంజ్ఞలు లేకుండా కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఖాతాదారుల పాస్‌వర్డ్‌లను తమ ప్రమేయం లేకుండా అంతర్గత సర్వర్లు నిల్వ చేసుకున్నాయని ఫేస్బుక్ మార్చిలో ప్రకటించింది. దీని వల్ల తమ ఉద్యోగులు పాస్‌వర్డ్‌లను సులువుగా చూడగలిగారని చెప్పింది. అయితే... బయటి వ్యక్తులెవరూ పాస్వర్డ్లు తెలుసుకునే అవకాశమే లేదని స్పష్టం చేసింది.
ఫేస్బుక్, ఫేస్బుక్ లైట్ యాప్‌లను వినియోగించిన లక్షలాది వినియోగదారులకు పాస్‌వర్డ్‌కు సంబంధించిన రక్షణపరమైన లోపం ఉందని గుర్తించినట్టు మార్చిలోనే ప్రకటించింది సామాజిక మాధ్యమ దిగ్గజం.