ETV Bharat / business

భారత్​లో త్వరలో మరో టీకా- పిల్లలకు కూడా!

భారత్​లో కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ దేశీయ సంస్థ జైడస్ క్యాడిలా దరఖాస్తు చేసుకుంది. తమ టీకా 12-18 సంవత్సరాల వయసున్న పిల్లలకు సైతం సురక్షితమని సంస్థ ప్రకటించింది.

Zydus Cadila
కరోనా టీకా అత్యవసర వినియోగానికి 'జైడస్' దరఖాస్తు
author img

By

Published : Jul 1, 2021, 8:42 AM IST

Updated : Jul 1, 2021, 11:39 AM IST

భారత్​లో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దేశీయ ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన టీకా 'జైకోవ్-డీ' అత్యవసర వినియోగానికి అనుమతి(ఈయూఏ) కోరింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.

దేశంలో పెద్దఎత్తున క్లినికల్ ట్రయల్స్ జరిపినట్లు సంస్థ ప్రకటించింది. దాదాపు 50 కేంద్రాలల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో.. టీకా రెండు డోసులు పొందిన వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపింది. 12-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు 'జైకోవ్-డి' సురక్షితమని ప్రకటించింది. ఏటా 10-12 కోట్ల డోసులను తయారు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.

దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు తోడు జైడస్ టీకా​కు అనుమతి లభిస్తే మరింత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.