కరోనాపై పోరుకు ఆర్థిక సహాయం ప్రకటించారు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు. కొవిడ్-19పై పరిశోధనలు చేస్తున్న బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు 25 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్ నివారణకు కలిసికట్టుగా పనిచేస్తామని జుకర్‌బర్గ్ ఉద్ఘాటించారు. కొవిడ్-19ను ఎదుర్కొనే మందును కనుగొనటమే తమ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని రకాల మందులను పరీక్షించగా.. కరోనా వైరస్‌ను తగ్గించటానికి కొంతమేర అవి పనిచేస్తున్నాయని జుకర్‌బర్గ్ చెప్పారు.
కొవిడ్-19పై పోరాడేందుకు ఈ నెల ప్రారంభంలోనే బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్ 125 మిలియన్ డాలర్లతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. అందరికీ అందుబాటు ధరలో చికిత్స అందాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టు ప్రాంరంభించినట్లు పేర్కొంది. కరోనా కట్టడికి మిలిందా పౌండేషన్ వారు ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ కలిసి పనిచేస్తుండటం గమనార్హం.
ఇదీ చూడండి:దేశంలో ఆ నెల వరకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు