ETV Bharat / business

ముడిచమురు ధరలు క్షీణించినా-పెట్రోల్​, డీజిల్​ తగ్గలేదు ఎందుకు? - డీజిల్ ధరలు

కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే దేశంలో మాత్రం ఇంధన ధరలు తగ్గడం లేదు. దీనికి కారణమేంటి? ధరలు ఎందుకు తగ్గడం లేదు? పూర్తి వివరాలు మీ కోసం.

FUEL PRICE IN INDIA
పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి కారణం ఏంటి
author img

By

Published : Mar 21, 2020, 6:22 AM IST

కరోనా కారణంగా డిమాండ్ తగ్గి అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమైనట్లు ఇటీవల వార్తల్లో తరచూ వింటూనే ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గినా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్​ ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గిన మాట వాస్తవమే. అయితే మన దేశానికి చెందిన చమురు మార్కెటింగ్ సంస్థలు ముడిచమురు తీసుకుని రిటైల్ మార్కెట్లో విక్రయించాలి. ఇలా అమ్ముకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా కంపెనీలు పన్నుల చెల్లించాల్సి వస్తుంది. ఆ పన్నుల ఆధారంగానే చమురు ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంటాయి.

ఇదీ లెక్క..

దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27.96, డీజిల్ ధర లీటర్​కు రూ.31.49 (2020 మార్చి 16) నాటికి. కానీ వినియోగదారులు లీటర్​ పెట్రోల్​కు రూ.69.29, డీజిల్​కు రూ.62.29 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అసలు ధరపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్​పై రూ.37.77 డీజిల్​పై రూ.28.02 పన్నులు రూపంలో వసూలు చేస్తున్నాయి.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎక్సైజ్​ రూపంలో కేంద్రం లీటర్​ పెట్రోల్​పై రూ.22.98, డీజిల్​పై రూ.18.83 వసూలు చేస్తుంది. ఇదే సమయంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్​) రూపంలో దిల్లీ ప్రభుత్వం లీటర్​ పెట్రోల్​పై రూ.14.79, లీటర్​ డీజిల్​పై రూ.9.19 వసూలు చేస్తోంది. ఈ కారణంగా అసలు ధర కన్నా పెట్రోల్​పై 54 శాతం, డీజిల్​ పై 45 శాతం అదనపు భారం పడుతోంది.

మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు ఇతర రాష్ట్రాల్లో సుంకాలు ఇంకొంచెం ఎక్కువగా ఉంన్నాయి. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరల సవరణ విషయంలో చమురు మార్కెటింగ్ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అయితే ప్రభుత్వం నుంచి పరోక్షంగా ఉన్న సుంకాల పెంపుతో ధరలను నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయంగా తగ్గిన ధరలను వినియోగదారులకు అందించలేకపోతున్నాయి.

సుంకం రూ.3 పెంపు..

జనవరి నుంచి గమనిస్తే ఇప్పటి వరకు చమురు ధర రూ.7నుంచి రూ.8 వరకు తగ్గాలి. అయితే పెరిగిన సుంకాల కారణంగా తగ్గింపు సాధ్యం కాలేదు. మార్చి 14న ఎక్సైజ్ సుంకం రూ.3 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం ఏప్రిల్ 1 వరకు చమురు ధరలు తగ్గించకుంటే చమురు మార్కెటింగ్ సంస్థల మార్జిన్లు లీటర్​పై రూ.11.63 గా ఉండొచ్చు. ఈ సమయంలోనూ లీటర్ పెట్రోల్, డీజిల్​పై 15,30 పైసలు తగ్గిస్తూ వచ్చినా.. రూ.8నుంచి రూ.10 వరకు కంపెనీల మార్జిన్లు కొనసాగే అవకాశముంది.

ప్రభుత్వాల ఆదాయం ఇలా..

తగ్గిన చమురు ధరల ఫలితాలను ప్రజలకు అందివ్వకపోవడం వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్​, పన్ను ఆదాయం 2014-15 నుంచి భారీగా పెంచుకుంటున్నాయి. 2018-19 సంవత్సరం మొత్తం రూ.2,14,000 కోట్లు అర్జించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.1,50,000 కోట్లు ప్రభుత్వాలు అర్జించడం గమనార్హం.

ఇదీ చూడండి:కరోనా దెబ్బతో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.