సరికొత్త ఫీచర్లతో 5 రకాల ఉత్పత్తులను వివిధ డివైజ్‌లలో మన ముందు ఉంచబోతోంది స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షియోమి. ఇక ఫోన్ల ప్రియల కోసం ఎమ్ఐ సీసీ9 కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. 108 మెగా పిక్సల్ కెమెరా దీని ప్రత్యేకత. ఇంతవరకూ ఏ సంస్థా ఇంత భారీ మెగా పిక్సల్ కెమెరాను అందించలేదు. దీనితో పాటు ఎమ్ఐ టీవి 5 సిరీస్‌ను లాంఛనంగా విడుదల చేయనుంది. గతంలో విడుదల చేసిన టీవీ 4 సిరీస్ కంటే మెరుగైన ఫీచర్స్‌ను ఇందులో అమర్చింది.
ఇతర ఉత్పత్తులు
రెడ్మీ పవర్ బ్యాంక్ 3, రెడ్ మీ ఎయిర్ ప్యూరిఫైయర్ మ్యాక్స్ ఎడిషన్‌ను, స్మార్ట్ వాచ్నూ ఇదే రోజు మార్కెట్లోకి వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.
టీవీ 5 సిరీస్ ప్రత్యేకతలు
షియోమి ఈసారి ఎంఐ 5 రేంజ్ స్మార్ట్ టీవీని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు షియోమి ఎంఐ 4 రేంజ్లో.. పలు స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించిన ఎంఐ 5 టీవీల్లో సరికొత్త ఫీచర్లు జోడించింది. టీవీ4 సిరీస్‌తో పోలిస్తే ఈ మోడల్ మరింత కొత్తగా ఉంటుంది.
ప్రత్యేకతలు
- క్యూఎల్ఈడీ ప్యానెల్
- 12 ఎన్ఎమ్ ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్,
- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
ఇదీ చూడండి : ఇండిగో సర్వర్ డౌన్... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు