ETV Bharat / business

రతన్​ టాటా ఓ కార్ల కలెక్షన్ ​'కింగ్'​... - రతన్​ టాటా గ్యారేజీ

రతన్​టాటాకు విలువలతో కూడిన దిగ్గజ వ్యాపారవేత్తగా ఎంతో పేరుంది. అన్నింటిలోనూ తనదైన మార్క్​తో దూసుకెళ్తున్నాయి టాటా సంస్థలు. మరి అలాంటి సంస్థ అధిపతికి కార్లంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయన గ్యారేజ్​లో కోట్ల రూపాయల విలువైన కార్లు దర్శనమిస్తాయి. వాటిల్లో కొన్ని టాప్​ కార్ల గురించి తెలుసుకుందాం...

ratan tata cars
టాటా ఓ కార్ల కలెక్షన్ ​'కింగ్'​...
author img

By

Published : Jun 29, 2020, 11:01 AM IST

రతన్​ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే దిగ్గజ​ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా పేరు పొందిన గొప్ప వ్యక్తి. ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు కొన్ని అభిరుచులూ, ఇష్టాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కార్ల సేకరణ. అందుకే ఆయన గ్యారేజ్​లో విలువైన కార్లు దర్శనమిస్తాయి. పాత తరం నుంచి లేటెస్ట్​ మోడళ్ల వరకు ఎన్నో కార్లను ఆయన సొంతం చేసుకున్నారు. వాటిల్లో టాటా నిక్సన్​, మెర్సిడెస్​​​ బెంజ్​, కార్డిల్లాక్​ ఎక్స్​ఎల్​ఆర్​, క్రిస్లెర్​ సెబ్రింగ్​, టాటా ఇండిగో వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ కలెక్షన్​లోని కొన్ని లగ్జరీ కార్లపై ఓ లుక్కేద్దాం.

లాండ్​ రోవర్​ ఫ్రీ లాండర్​:

ఎలాంటి వాతావరణంలోనైనా, కొండల్లోనైనా దూసుకెళ్లగల సత్తా ఈ కారు సొంతం. 2014లోనే ఈ మోడల్​ తయారీని నిలిపివేసినా.. అంతకుముందే టాటా దీన్ని సొంతం చేసుకున్నారు. నాలుగు సిలిండర్​లు కలిగిన డీజిల్​ ఇంజిన్​ ఇందులో ఉంటుంది. ఇది 187 బీహెచ్​పీ(బ్రేక్​ హార్స్​ పవర్​), 420 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 గేర్లతో ఆటోమేటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది. దీని ధర రూ.44 కోట్ల నుంచి ప్రారంభం(ఎక్స్​ షోరూమ్​).

ratan tata cars
లాండ్​ రోవర్​ ఫ్రీ లాండర్

మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​-క్లాస్​:

వావ్​ అనిపించే డిజైన్, చూడగానే ఆకట్టుకునే రంగు ఈ లగ్జరీ కారు సొంతం. తొలిచూపులోనే ఎవరైనా దీని మాయలో పడాల్సిందే. అందుకే టాటాను కూడా మెప్పించగలిగింది. జర్మనీ సంస్థ తయారు చేసిన ఈ ఎస్​ మోడల్​ కారును ఆయన సొంతం చేసుకున్నారు. 3982 వీ8 పెట్రోల్​ ఇంజిన్​, ఆటోమేటిక్​ గేర్​బాక్స్​, గంటకు 300 కి.మీ. వేగం ఈ కారు ప్రత్యేకతలు. లీటరుకు 7 కి.మీ. మైలేజ్​ ఇస్తుంది. ధర రూ.2.55 కోట్లు(ఎక్స్​ షోరూమ్​)

ratan tata cars
మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​-క్లాస్​

టాటా నెక్సాన్​:

టాటా మోటార్స్​ సంస్థ తయారు చేసిన ఈ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అందుకే మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధర ఉన్నా ఈ ఎస్​యూవీకి టాటా గ్యారేజ్​లో చోటు దక్కింది. చూడటానికి స్పోర్ట్స్​ కారులా ఉండటం, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ల వల్ల దీనికి భారీ డిమాండ్​ లభించింది. ఈ కారును రెండు రంగుల్లో విడుదల చేశారు. ఇందులో నీలం రంగు కారులో టాటా చాలాసార్లు కనిపించారు. ఈ మోడల్​​లో 1.2 లీటర్ల పెట్రోల్​ టర్బో ఇంజిన్​, 1.5 లీటర్ల ఇంజిన్​తో రెండు రకాల కార్లు వచ్చాయి. దీని ధర రూ.6.95 లక్షలు(ఎక్స్​ షోరూమ్​)

ratan tata cars
టాటా నెక్సాన్​

ఫెరారీ కాలిఫోర్నియా:

ఎరుపు రంగు ఫెరారీ కాలిఫోర్నియా మోడల్​ను కూడా రతన్ టాటా కొనుగోలు చేశారు. రెండు డోర్లు ఉండే ఈ ఓపెన్​ టాప్​ కారు అంటే టాటాకు చాలా ఇష్టం. అనేకమార్లు ఈ వాహనంపై కనిపించారు. 4.3 లీటర్ల వీ8 ఇంజిన్​, 504 ఎన్​ఎం టార్క్​, 552 బీహెచ్​పీ దీని సొంతం. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తి మన దేశంలో జరగట్లేదు. ఫెరారీ విడుదల చేసిన అన్ని మోడళ్లలో ఇది బాగా ఆకట్టుకుంది. దీని ధర రూ.3.13 కోట్ల నుంచి ప్రారంభం(ఎక్స్​ షోరూమ్​)

ratan tata cars
ఫెరారీ కాలిఫోర్నియా

మసెరటి క్వట్రోపోర్టే:

ఇటాలియన్​ మోడల్​లో ఉండే ఈ కారుకు రతన్​ టాటా గ్యారేజ్​లో చోటు దక్కింది. ఈ లగ్జరీ స్పోర్ట్స్​ సెడాన్​ను చాలా మంది తమ డ్రీమ్​ కారుగా భావిస్తారు. రెండు​ టర్బో వీ6 పెట్రోల్​ ఇంజిన్లతో ఇది నడుస్తుంది. దీని ఇంజిన్​ 424 బీహెచ్​పీ పవర్​​, 580 ఎన్​ఎం టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. 270 కి.మీ/గంటకు వేగంతో దూసుకెళ్తుంది. ఇందులోని జీటీఎస్​ వెర్షన్​లో ట్విన్​ టర్బో వీ8 పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 530 బీహెచ్​పీ పవర్​, 710 ఎన్​ఎమ్​ టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.71 కోట్లు(ఎక్స్​ షోరూం)

ratan tata cars
మసెరటి క్వట్రోపోర్టే

మెర్సిడెస్​ బెంజ్​ 500 ఎస్​ఎల్​:

సూపర్​ లైట్​లో ఉండే మెర్సిడెస్​ బెంజ్​ 500 ఎస్​ఎల్​.. టాటా కలెక్షన్​లో ఒకటి. 5 లీటర్ల వీ8 ఇంజిన్​తో పనిచేసే ఈ కారు.. 8.1 కి.మీ/లీటరు మైలేజ్​ ఇస్తుంది. 392 బీహెచ్​పీ పవర్​, 530 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.15 కోట్లు(ఎక్స్​ షోరూం)

ratan tata cars
మెర్సిడెస్​ బెంజ్​ 500 ఎస్​ఎల్​

టాటా ఇండిగో మరినా..

రతన్ టాటా గ్యారేజ్​లో ఎక్కువ కాలంగా ఉన్న వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది టాటా ఇండిగో మరినా. ఈ కారులో చాలా సార్లు కనిపించారు రతన్ టాటా. వీటితో పాటు టాటా వద్ద క్రైస్లర్ సెబ్రింగ్, మెర్సిడెజ్ బెంజ్ డబ్ల్యూ 124, క్యాడలిక్ ఎక్స్ఎల్ఆర్ వంటి విభిన్న మోడల్​ కార్లు కూడా ఉన్నాయి.

ratan tata cars
టాటా ఇండిగో మరినా

అందరికీ అందుబాటులో...

విలువలు కలిగిన వ్యాపారిగా పేరున్న రతన్​ టాటా.. అతితక్కువ ధరలో కారును ప్రజలకు అందించాలని 'టాటా నానో'ను తీసుకొచ్చారు. ఇందుకు కారణాన్ని ఓ వేదికపై చెప్పారు. నలుగురు కుటుంబసభ్యులు ఒకే మోటార్‌సైకిల్‌పై వానలో తడుచుకుంటూ వెళ్లటాన్ని ఒకసారి రతన్‌ టాటా చూశారట. ఆ సందర్భంలో.. మధ్య తరగతి కోసం సరసమైన ధరలో ఒక కారు తయారుచేయాలని నిర్ణయించుకొన్నారట. అలా నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ratan tata cars
నానో కారుతో రతన్​టాటా

"నానో తయారీకి ఖర్చులు ఎక్కువ. కానీ నేను మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కారు పట్ల ఇప్పటికీ నేను గర్వంగానే ఉన్నా. అదే నిర్ణయంతో ముందుకెళ్లాననుకుంటున్నా" -- రతన్​ టాటా, వ్యాపారవేత్త.

పది సంవత్సరాల క్రితం విడుదలైన ఈ కారు.. అమ్మకాల పరంగా నిరాశపరచింది. భద్రతా కారణాలు, ఇంజిన్‌లో సమస్యల కారణంగా ప్రజలు దీని కొనుగోలుపై ఆసక్తి చూపలేదు.

82 ఏళ్ల రతన్ టాటా.. సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న వేళ.. రతన్ టాటా 1500 కోట్ల రూపాయల భారీ సాయాన్ని అందించారు. రూ.500 కోట్లు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి ఇచ్చారు. మరో రూ.1000కోట్లు టాటా గ్రూపుల తరఫున అందించారు. టాటా గ్రూపులకు చెందిన తాజ్ హోటల్​ను కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం అందించారు. రతన్ టాటాకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషన్ ఇచ్చి గౌరవించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.