ETV Bharat / business

చైనాకు భారత్​ మరో షాక్​- బిడ్డర్లపై ఆంక్షలు!

చైనా పెట్టుబడులను అరికట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత్​. ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో సరిహద్దు దేశాల బిడ్డర్లపై ఆంక్షలు విధించింది. టెండర్లు వేసేందుకు సంబంధిత అధికారి వద్ద నమోదై ఉండడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించింది ఆర్థిక శాఖ.

author img

By

Published : Jul 24, 2020, 2:40 PM IST

imposes-restrictions-on-public-procurement
చైనాకు మరో షాక్​.. సరిహద్దు దేశాల బిడ్డర్లపై ఆంక్షలు!

చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో ఆ దేశ యాప్​లను నిషేధించిన భారత్​.. డ్రాగన్​కు మరో షాక్​ ఇచ్చింది. భారత్​లో చైనా పెట్టుబడులను కట్టడి చేసేలా సాధారణ ఆర్థిక నియమాలు-2017లో సవరణలు చేసింది. దీని ద్వారా ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో.. భారత్​తో సరిహద్దు దేశాల బిడ్డర్లపై ఆంక్షలు విధించింది కేంద్రం. టెండర్లు వేసేందుకు సంబంధిత అధికారి వద్ద తప్పనిసరిగా నమోదై ఉండాలని స్పష్టం చేసింది.

" సామగ్రి, సేవలు( కన్సల్టెన్సీ, నాన్​-కన్సల్టెన్సీ సేవలు సహా), ఇతర పనులు, ఏదైనా కొనుగోళ్ల కోసం వేలం వేయడానికి.. బిడ్డర్​ సంబంధిత అథారిటీలో నమోదై ఉంటేనే అర్హులు అవుతారు. రిజిస్ట్రేషన్​ కమిటీని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక​ విభాగం(డీపీఐఐటీ) ఏర్పాటు చేస్తుంది. రాజకీయ, భద్రత పరమైన అంశాల్లో విదేశాంగ, హోంశాఖల నుంచి అనుమతులు తప్పనిసరి."

- ఆర్థిక శాఖ

కొత్త ఆదేశాల పరిధిలోకి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు​, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నవి వస్తాయని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ.

సీఎస్​లకు లేఖలు..

జాతీయ భద్రత, రక్షణ విషయంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది ఆర్థిక శాఖ. రాష్ట్రాలు, రాష్ట్రాల ఆధీనంలోని సంస్థలు జరిపే కొనుగోళ్ల విషయంలో కొత్త నిబంధనలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

వీటికి మినహాయింపు..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఔషధాల సరఫరా సహా కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఈ మినహాయింపులు 2020, డిసెంబర్​ 31 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. అలాగే.. భారత్​ సాయం చేస్తోన్న దేశాలకూ రిజిస్ట్రేషన్​ నుంచి మినహాయింపునిస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

టెండర్లన్నీ రద్దు..

ఇప్పటికే టెండర్లు పిలిచి ఉంటే.. ఎంపిక దశలో, ఆ తర్వాతి దశలో ఉన్నప్పటికీ కొత్త నియమాల ప్రకారం రిజిస్టర్​ చేసుకోని వారి టెండర్లు రద్దు చేయాలని స్పష్టం చేసింది ఆర్ధిక శాఖ. ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.