ETV Bharat / business

వన్​టైం రుణ పునర్నిర్మాణం అమలు సాధ్యమేనా?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ఎస్ఎం​ఈ ఖాతాల వన్​టైం పునర్నిర్మాణ ప్రక్రియ అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో సంస్థల యజమానులు భవిష్యత్తు అంచనాలు వేయలేరని చెబుతున్నారు. అసలేమిటీ వన్​టైం రుణ పునర్నిర్మాణ ప్రక్రియ? మారటోరియం కన్నా ఎంతమేరకు అనువుగా ఉంటుంది? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు?

onetime restructuring of bad loan account
భారత రిజర్వ్ బ్యాంక్
author img

By

Published : Aug 13, 2020, 4:25 PM IST

చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎస్​ఎంఈ)లపై ఆర్​బీఐ గతవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రామాణిక వర్గీకరణ కింద ఉన్న ఖాతాల వన్​టైం రుణ పునర్నిర్మాణానికి అనుమతిస్తూ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయించింది. 2021 మార్చి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

ఇది అమలు చేయగలిగితే కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎస్​ఎంఈలకు ఊరట కలుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పునర్నిర్మాణ ప్రక్రియ అంత సులభంగా అమలు చేయలేమని ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణుడు జస్​పాల్ బింద్రా అభిప్రాయపడ్డారు.

రుణ పునర్నిర్మాణం సాధ్యమేనా?

అయితే మారటోరియం కాకుండా వన్​టైం సెటిల్​మెంట్​, పునర్నిర్మాణాన్నే చాలా మంది కోరుకుంటున్నారని సెంట్రమ్​ గ్రూప్ ఛైర్మన్ జస్​పాల్ బింద్రా చెబుతున్నారు. కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్​బీఐ ఆమోదించిన వన్​టైం పునర్నిర్మాణ పథకం అమలుకు సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

"పునర్నిర్మాణ ప్రక్రియను ఒక్కరోజులో ఎలా చేయగలుగుతారు. ఈ ప్రక్రియలో రుణ దాతలు, గ్రహీతలు చాలా చర్చించాల్సి ఉంటుంది. రుణ గ్రహీతల అవసరాలను బ్యాంకింగ్ సంస్థలు అర్థం చేసుకోవాలి. డిమాండ్​ అనిశ్చితిలో ఉన్న వేళ భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహీతలు మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది."

- జస్​పాల్ బింద్రా, ప్రముఖ బ్యాంకిగ్ రంగ నిపుణుడు​

భవిష్యత్తు అంచనా కష్టమే!

జస్​పాల్ బింద్రాకు బ్యాంక్​ ఆఫ్ అమెరికా, యూబీఎస్, స్డాండర్డ్​ ఛార్టర్​డ్ బ్యాంకుల్లో పని చేసిన అనుభవం ఉంది. లాక్​డౌన్​ పూర్తిగా ఎత్తేసిన తర్వాత ఎలాంటి వ్యాపారాలు మనుగడ సాగిస్తాయో ముందుగా అంచనా వేయటం చాలా కష్టమని ఈటీవీ భారత్​తో తెలిపారు బింద్రా.

"లాక్​డౌన్​ తర్వాత తమ వ్యాపారాలు ఎలా సాగుతాయో యజమానులు అంచనా వేయటం కష్టం. ఉదాహరణకు ఒక రెస్టారెంట్ యజమానిని తీసుకుంటే.. కరోనాకు ముందు రోజుకు 100 మంది వినియోగదారులు వస్తారనుకోండి. లాక్​డౌన్​ తర్వాత ఆ సంఖ్య 80-60కి ఉండవచ్చు. లేదా 30కి పడిపోవచ్చు. రుణ పునర్నిర్మాణానికి భవిష్యత్తు అంచనాలు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో పునర్నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది?"

- జస్​పాల్ బింద్రా

ఏమిటీ రుణ ఖాతాల పునర్నిర్మాణం?

వ్యాపారులు పెట్టుబడి కోసం రుణాలు తీసుకుంటారు. గృహ నిర్మాణం, వాహనాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు. అయితే పరిస్థితుల ప్రభావం కారణంగా నెలవారీ వాయిదాలు చెల్లించలేని పక్షంలో రుణ ప్రణాళికను ఒకసారి మదింపు చేసి మళ్లీ పునర్నిర్మిస్తారు.

ఈ పథకం కింద తొలుత ఒప్పందంలో నిర్ణయించిన రుణ కాల పరిమితి గడువు పెరిగే అవకాశం ఉంటుంది. పరిస్థితి అదుపులోకి వచ్చాక గ్రహీతలు రుణాల చెల్లింపులకు అనుగుణంగా నెలవారీ వాయిదా మొత్తాల్లో మార్పులు చేస్తారు.

మారటోరియం, పునర్నిర్మాణం- ఏదీ మంచిది?

రుణ పునర్నిర్మాణం కన్నా మారటోరియం పొడిగింపు ప్రక్రియను సులభంగా అమలు చేయవచ్చు. కానీ, దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది రుణాలను చెల్లించకుండా ఉండే ప్రమాదం ఉందని బింద్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇది వారికే ఇబ్బందులు కలిగిస్తుంది. మారటోరియం వినియోగించుకుంటే తర్వాత అధిక వడ్డీ భారం పడుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యల్లో భాగంగా వ్యాపారాలు, రిటైల్​ రుణాలపై 6 నెలల మారటోరియం కూడా విధించింది ఆర్​బీఐ. ఈ గడువు ఆగస్టుతో పూర్తి కానుంది. అయితే ఈ గడువు మరింత పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గృహ రుణాలకు ఉన్న సౌలభ్యమేంటి?

ఆగస్టు తర్వాత మారటోరియం గడువు పొడిగించకపోతే గృహ రుణ గ్రహీతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని బింద్రా తెలిపారు. వడ్డీ వ్యాపారాల్లో గృహ రుణాలపై అత్యల్ప మారటోరియానికే మొగ్గుచూపుతున్నారని బింద్రా స్పష్టం చేశారు.

"గృహాల లోన్లపై రుణదాతలకు సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి సురక్షితమైన ఆస్తులు. వారి ప్రయోజనాలు కాపాడేందుకు సర్ఫేసీ చట్టం ఉంది. అందువల్ల గృహ రుణాలు తక్కువ స్థాయిలో వినియోగించుకున్నప్పటికీ, మారటోరియం బ్యాంకింగ్​ సంస్థలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది."

- జస్​పాల్ బింద్రా

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠి)

ఇదీ చూడండి: రేట్లు తగ్గించలేదు కానీ.. పలు కీలక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.