వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఒకే వాట్సాప్ ఖాతాను పలు పరికరాల్లో వినియోగించుకోవడానికి వీలు కల్పించేలా ఓ ఫీచర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే... వాయిస్ మెసేజ్ ప్రివ్యూ, వాట్సాప్ డార్క్‌మోడ్, క్యూఆర్ కోడ్, పిప్ మోడ్ 2.0, ఎట్ అల్ ఫీచర్లు విడుదల చేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
"వినియోగదారులు బహుళ పరికరాల్లో ఒకే ఖాతాను వాడుకునేందుకు వీలు కల్పించేలా మల్టిపుల్ ప్లాట్‌ఫాం వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ధ్రువీకరించింది."
- డబ్ల్యూ.ఎ.బీటాఇన్ఫో
ప్రస్తుతం ఒకే వాట్సాప్ ఖాతాను ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో వినియోగించడం సాధ్యంకాదు. ఒక డివైస్‌లో షట్‌డౌన్ చేశాకే మరో డివైస్‌లో వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఐఫోన్, ఆండ్రాయిడ్, ఐప్యాడ్, విండోస్(యూడబ్ల్యూపీ)లతో సహా పలు పరికరాల్లో ఒకే వాట్సాప్ ఖాతాను వినియోగించుకోవడానికి వీలవుతుంది.
ఇంటర్నెట్తో పనిలేదు
ఫోన్‌ను ఇంటర్నెట్తో అనుసంధానం చేయాల్సిన అవసరం లేకుండానే, వైబ్‌లో వాట్సాప్ ఉపయోగించుకునేలా ఓ కొత్త డెస్క్‌టాప్ వర్షెన్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ మల్టీ ప్లాట్‌ఫాం ఫీచర్‌ను మొదట ఐఓఎస్ బీటా 2.19.80.16 గుర్తించినట్లు డబ్ల్యూ.ఎ.బీటాఇన్ఫో తెలిపింది.
ఇదీ చూడండి: 'రోబోటిక్స్ పెరిగినా.. ఉద్యోగాలకు ఢోకా ఉండదు'